Floods: మధ్యప్రదేశ్‌ను ముంచెత్తిన వరదలు.. ఉప్పొంగి ప్రవహిస్తున్న నదులు
- మధ్యప్రదేశ్‌ను ముంచెత్తిన వరదలు
- ఉప్పొంగి ప్రవహిస్తున్న నదులు
- ఆగస్టు 25 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మధ్యప్రదేశ్‌ను వరదలు ముంచెత్తాయి. పలు జిల్లాల్లో వరదలు బీభత్సం సృష్టించాయి. బర్గి డ్యామ్ 13 గేట్లు తెరవడంతో నర్మదా ఉధృతంగా ప్రవహిస్తోంది. రేవాలో 4,000 మందికి పైగా ప్రజలను రక్షించారు. మధ్యప్రదేశ్‌లోని తూర్పు జిల్లాలైన దిండోరి, పన్నా, రేవా, సత్నా, నర్సింగ్‌పూర్, ఛతర్పూర్, మౌగంజ్, మైహార్లలో వరదలకు గురయ్యాయి. వర్షాల కారణంగా నర్మదా, మందాకిని, అష్టభుజ నదులు పొంగిపొర్లుతున్నాయి.

Also Read
- Russia Oil: ‘‘రష్యా చమురు కొనొద్దు’’.. భారత్, చైనాలకు ట్రంప్ టీమ్ వార్నింగ్..
- BRICS Summit: బ్రిక్స్ తర్వాత ప్రపంచ నాయకులకు అస్వస్థత అంటూ తప్పుడు ప్రచారం.. తీవ్రంగా ఖండించిన భారత్
- Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
- Semicon India 2026: సెమీకాన్ ఇండియా 2026 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సెమీకండక్టర్ రంగంలో భారీ సంస్కరణలు
మధ్యప్రదేశ్‌లోని తూర్పు జిల్లాల్లో కురిసిన వర్షాల కారణంగా వరద లాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. నర్మదా, మందాకిని నదులతో సహా పలు నదులు ఉప్పొంగుతున్నాయి. శుక్రవారం కూడా వరదలు కొనసాగాయి. నీరు ప్రవేశిస్తున్న మధ్యప్రదేశ్‌లోని నివాస ప్రాంతాల్లో యంత్రాంగం సహాయక, రెస్క్యూ ఆపరేషన్లను ముమ్మరం చేసింది. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. దిండోరి, పన్నా, రేవా, సత్నా, నర్సింగ్‌పూర్, ఛతర్పూర్ జిల్లాలు అత్యధిక ప్రభావాన్ని ఎదుర్కొంటున్నాయి. భద్రతా కారణాల దృష్ట్యా మైహార్, దిండోరి జిల్లాల్లోని పాఠశాలలను మూసివేశారు. దిండోరిలోని అంగన్వాడీ కేంద్రాలను కూడా మూసివేశారు.

రేవా జిల్లాలో పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. శుక్రవారం నాటికి సుమారు 3,000 మందిని 27 సహాయక శిబిరాలలో ఉంచారు. ఇప్పటివరకు వరదల కారణంగా చిక్కుకుపోయిన 4,000 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రెవెన్యూ అధికారులు, పోలీసులు, సహాయక బృందాలను వరద ప్రభావిత ప్రాంతాలలో మోహరించారు.

మధ్యప్రదేశ్‌లో ఆగస్టు 25 వరకు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. తూర్పు ప్రాంతంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఎక్కువగా ఉందని వెల్లడించింది. మధ్య -పశ్చిమ-మధ్య ప్రాంతాలలో వర్షపాతం క్రమంగా పెరుగుతుందని పేర్కొంది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం.. మధ్యప్రదేశ్‌లో ఈ కాలానికి సాధారణ సగటు వర్షపాతం 675.1 మి.మీ. కాగా.. 599 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఇది 11 శాతం లోటును సూచిస్తుంది. తూర్పు మధ్యప్రదేశ్‌లో 11 శాతం, పశ్చిమ మధ్యప్రదేశ్‌లో 12 శాతం వర్షపాతం లోటు నమోదైంది. వాతావరణ శాస్త్రవేత్తల ప్రకారం..ఈశాన్య మధ్యప్రదేశ్, దాని పరిసర ప్రాంతాలలో నెలకొన్న అల్పపీడనం, రుతుపవన ద్రోణి కారణంగా ఈ పరిస్థితి ఏర్పడింది.
తాజావార్తలు
-
Russia Oil: ‘‘రష్యా చమురు కొనొద్దు’’.. భారత్, చైనాలకు ట్రంప్ టీమ్ వార్నింగ్..
-
Jeevanlal Lavidiya : మాజీ ఐటీ కమిషనర్‌కు మరో షాక్.. భార్యపైనా కేసు.!
-
BRICS Summit: బ్రిక్స్ తర్వాత ప్రపంచ నాయకులకు అస్వస్థత అంటూ తప్పుడు ప్రచారం.. తీవ్రంగా ఖండించిన భారత్
-
Sarah Shahi: బెడ్రూమ్ సీన్లలో హీరోల స్పర్శ తగలకుండా ఆ బాల్తోనే.. బోల్డ్ సీన్స్ అసలు గుట్టు విప్పిన హీరోయిన్!
-
Dharmana Krishnadasu: వర్షాలు లేక సాగు ఆలస్యం.. ఎరువులు లేక రైతుల అవస్థలు.. ధర్మాన కృష్ణదాసు ఆవేదన..
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!