Site icon NTV Telugu

Hanuman Chalisa: లోక్‌సభలో హనుమాన్ చాలీసా పఠించిన మహారాష్ట్ర సీఎం కుమారుడు

Srikanth Shinde

Srikanth Shinde

Hanuman Chalisa: శివసేన ఎంపీ(షిండే వర్గం), మహారాష్ట్ర ముఖ్యమంత్రి కుమారుడు శ్రీకాంత్ షిండే ఉద్ధవ్‌ ధాక్రే వర్గంపై లోక్‌సభలో విరుచుకుపడ్డారు. హిందుత్వ, బాల్‌ థాక్రే సిద్ధాంతాలను వదలేశారని మండిపడ్డారు. మోడీ సర్కారుపై అవిశ్వాస తీర్మానాన్ని తన పార్టీ వ్యతిరేకించినందున లోక్‌సభలో హనుమాన్ చాలీసాను కూడా పఠించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే కుమారుడైన కళ్యాణ్‌ పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన లోక్‌సభ ఎంపీ ప్రతిపక్ష పార్టీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అవినీతికి పర్యాయపదంగా విపక్ష కూటమికి ‘ఇండియా’గా పేరును మార్చారని అన్నారు. ఇది కేవలం ఎన్డీయే వర్సెస్ ఇండియా మాత్రమే కాదు, స్కీమ్ వర్సెస్ స్కామ్ అని ఆయన అన్నారు.

Also Read: IIT Student: ప్లీస్ నా డెడ్ బాడీని ఎవరికీ చూపించకండి.. ఐఐటీ విద్యార్థిని సూసైడ్ నోట్..

అవిశ్వాస తీర్మానంపై చర్చలో పాల్గొన్న శ్రీకాంత్ షిండే మాట్లాడుతూ.. 2019లో బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్లినందున శివసేనకు చెందిన ఉద్ధవ్ థాక్రే వర్గం ఓటర్లను మోసం చేసిందని, అయితే ఆ తర్వాత పొత్తు తెగిపోయిందని అన్నారు. ‘‘2019లో ప్రజలు శివసేన, బీజేపీకి కలిపి ప్రజలు అధికారం ఇచ్చారు. నేనే ముఖ్యమంత్రిని కావాలని ఆయన భావించారు. వారు బాలాసాహెబ్ సిద్ధాంతాలను, హిందుత్వ భావజాలాన్ని పట్టించుకోలేదు.. హిందుత్వ భావజాలాన్ని అమ్ముకుని అడుగు వేశారు. బాలాసాహెబ్ భావజాలానికి దూరంగా ఉన్నారు” అని ఉద్ధవ్ థాక్రేను ఉద్దేశించి శ్రీకాంత్ షిండే అన్నారు.

“కాంగ్రెస్‌తో శివసేన పొత్తు ఉంటుందని ఎవరూ ఊహించలేదు. ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వారు ఓటర్లను మోసం చేశారు. కరసేవకులపై కాల్పులు జరిపిన సమాజ్‌వాదీ పార్టీతో కూడా పొత్తు పెట్టుకున్నారు” అని ఆయన అన్నారు. దివంగత ములాయం సింగ్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1990 అక్టోబర్ 30న అయోధ్యలో కరసేవకులపై కాల్పుల ఘటన జరిగింది. మహారాష్ట్రలో హనుమాన్ చాలీసా చదవకుండా ప్రజలను నిలిపివేశారని ఎంపీ అన్నారు. “హనుమాన్ చాలీసా మొత్తం నాకు తెలుసు…,” అంటూ శ్లోకాలు చదవడం మొదలుపెట్టాడు. అయితే సభాపతి తన ప్రసంగాన్ని కొనసాగించాలని కోరడంతో పూర్తి చేయలేదు.

Also Read: Phone Charging : ఫోన్ ను చార్జింగ్ పెట్టేటప్పుడు ఈ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే.. లేకుంటే పేలిపోతుంది..!

హనుమాన్ జయంతి రోజు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే హనుమాన్ చాలీసా పఠించాల్సిందేనని, లేకపోతే తామే ఆయన నివాసంలో ఆ పనిచేస్తామని అమరావతి ఎంపీ, నటి నవనీత్ కౌర్ రాణా, ఆమె భర్త రవి రాణా (ఎమ్మెల్యే) ప్రకటించిన విషయం తెలిసిందే. గత ఏడాది అమరావతి ఎంపీ నవనీత్ రాణా, ఆమె ఎమ్మెల్యే-భర్త రవి రాణాను ముంబై పోలీసులు ఏప్రిల్ 23న అరెస్టు చేయడంతో మహారాష్ట్రలో పెద్ద దుమారం చెలరేగింది. అప్పటి శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధిక్కరించే చర్యగా బీజేపీ హనుమాన్ చాలీసా బహిరంగ పఠనాలను కూడా నిర్వహించింది. ఉద్ధవ్ ఠాక్రేపై ఏకనాథ్ షిండే తిరుగుబాటు చేసి బీజేపీతో చేతులు కలపడంతో ఆయన ఉద్వాసనకు గురయ్యారు.

Also Read: Miss Indonesia Universe: లోదుస్తులను విప్పమని కోరారు.. మిస్ ఇండోనేషియా యూనివర్స్‌ నిర్వాహకులపై ఫిర్యాదు

2018లో ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని తీసుకొచ్చాయని, అయితే నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డీఏ) మళ్లీ ఎక్కువ మంది ఎంపీలతో వచ్చిందని శ్రీకాంత్ షిండే అన్నారు. ఈరోజు మరోసారి ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం పెట్టాయని, ఈసారి ఎన్డీయే 400 స్థానాల్లో విజయం సాధిస్తుందని ఆయన అన్నారు.ప్రతిపక్ష కూటమి కొత్త పేరుపై ఆయన మాట్లాడుతూ.. యూపీఏ పేరును ఇండియాగా మార్చారని, ప్రజలు తమకు మద్దతు ఇస్తారని వారు భావించారన్నారు. యూపీఏ కుంభకోణాలు, అవినీతి, ఉగ్రవాద దాడులు, రిమోట్ కంట్రోల్‌లను ప్రజలకు గుర్తు చేస్తుంది కాబట్టి వారు పేరు మార్చారని ఆయన ఆరోపించారు.

Exit mobile version