మహిళల రక్షణ కోసం ప్రభుత్వాలు ఎన్ని రకాల చట్టాలను అమలు చేస్తున్నా కూడా లైంగిక దాడులు తగ్గడం లేదు..కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల కోసం ఎన్ని చట్టాలు తెచ్చినా కామాంధులకు భయం వేయడం లేదు. నిత్యం ఎక్కడో ఒక చోట మహిళపై అఘాయిత్యాలు జరిగిన ఘటనలు వెలుగులో వస్తూనే ఉన్నాయి. ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో అని చూడకుండా లైంగిక దాడి చేస్తున్నారు.. ఇటీవల ఇలాంటి ఘటనలు చాలానే వెలుగు చూస్తున్నాయి.. తాజాగా మహారాష్ట్రలో దారుణమైన ఘటన వెలుగు చూసింది..ఓ మహిళా కార్మికురాలుపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. భర్తను బంధించి మరీ ఈ దారుణానికి ఒడిగట్టారు..
వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని రాయ్ గఢ్ జిల్లా సుదగఢ్ కు చెందిన 26 ఏళ్ల గిరిజన మహిళ తన భర్త, ఐదేళ్ల కుమారుడితో కలిసి అదే రాష్ట్రంలోని సతారా జిల్లాలకు వలస వెళ్లారు. అక్కడి ఓ బొగ్గు ఫ్యాక్టరీలో పనికి కుదిరారు. ప్రతీ రోజు అక్కడ పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. సమీపంలోని ఓ ఇంట్లో వారు నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో జూన్ 19వ తేదీన దాదాపు 11 మంది నిందితులు ఈ కుటుంబం నివసించే ఇంటికి చేరుకున్నారు.. సడెన్ గా వారంతా రావడంతో దంపతులు భయపడ్డారు..
ఒక్కసారిగా అందరు ఇంట్లోకి చోరబడ్డారు..ఆమె భర్తను ఓ గదిలో బంధించి, వారంతా సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఆ తర్వాత దంపతులు తమ కుమారుడి సాయంతో అక్కడి నుంచి ఎలాగోలా తప్పించుకున్నారు. అనంతరం బాధితురాలు ఆమె భర్త ఫాల్తాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రధాన నిందితుడిని అరెస్టు చేశారు. మిగితా నిందితుల కోసం గాలిస్తున్నారు.. ఒకేసారి పదకొండు మంది మహిళపై దాడి చెయ్యడం భాధాకరం అంటూ స్థానికులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు.. నిందితులను పట్టుకొని వెంటనే ఉరి తీయ్యాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు.. ఇప్పటికే ఈ ఘటన రాజీకీయ ప్రకంపనాలను సృష్టిస్తుంది.. ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..