Vijay Sethupathi: ఆమెకు జోడీగా నటించడం నా వల్ల కాదు.. విజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijay Sethupathi refused to act with Krithi Shetty: మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి త్వరలోనే ‘మహారాజ’తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ క్రైం, సస్పెన్స్ థ్రిల్లర్‌ను నిథిలన్ స్వామినాథన్ తెరకెక్కించారు. ప్యాషన్ స్టూడియోస్, ది రూట్‌పై సుధన్ సుందరం, జగదీష్ పళనిస్వామి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో అనురాగ్ కశ్యప్, భారతీరాజా, అభిరామి, మమత మోహన్ దాస్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మహారాజ జూన్ 14న థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ సినిమా ప్రచారంలో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో హీరోయిన్ కృతి శెట్టి గురించి మరోసారి విజయ్ సేతుపతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కూతురిగా భావించిన కృతి శెట్టికి జోడీగా నటించడం తన వల్ల కాదని విజయ్ సేతుపతి తెలిపారు. ‘నేను నటించిన డీఎస్పీ సినిమాలో కృతి శెట్టిని హీరోయిన్గా తీసుకుంటే.. చేయలేనని దర్శకనిర్మాతలకు చెప్పా. అందుకు కారణం ఉప్పెన చిత్రంలో ఆమెకు తండ్రిగా నటించడమే. కుమార్తెగా నటించిన అమ్మాయితో రొమాంటిక్ సీన్స్ అస్సలు చేయలేను. అందుకే డీఎస్పీ సినిమాలో కృతి వద్దు అని చిత్ర బృందంకు చెప్పా. ఉప్పెనలో కొన్ని క్లైమాక్స్ సన్నివేశాల్లో నటిస్తున్నప్పుడు కృతి చాలా కంగారు పడింది. నాకు నీ వయసు ఉన్న కుమారుడు ఉన్నాడు, నన్ను నీ తండ్రిగా భావించు అని ధైర్యం చెప్పా. కూతురిగా భావించిన ఆమెకు జోడీగా ఎలా నటించాలి. అది నా వల్ల కాదు’ అని విజయ్ తెలిపారు.
Also Read
- Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
- NASA: అంగారక గ్రహంపై ఏలియన్ 'జెల్లీఫిష్' కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
- Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
- T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్‌కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
Also Read: Pawan Kalyan Venkatesh: పిఠాపురం ఎమ్మెల్యే గారు.. పవన్ కల్యాణ్‌కు స్పెషల్ విషెస్ చెప్పిన వెంకటేష్!
ఉప్పెన చిత్రంతోనే కృతి శెట్టి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమాతోనే విజయ్ సేతుపతి డైరెక్ట్ తెలుగు చిత్రంలో నటించారు. బేబమ్మగా కృతి.. రాయణంగా విజయ్ నటించారు. ఈ ఇద్దరి మధ్య చాలా ఎమోషనల్ సీన్స్ ఉంటాయి. ఉప్పెన తర్వాత రెండు సినిమాల్లో హీరోయిన్గా చిత్ర యూనిట్ కృతిని ఎంపిక చేయగా.. మక్కల్ సెల్వన్ తిరస్కరించారు. ఇక డీఎస్పీ సినిమాలో అనుక్రీతి వాస్ మరియు శివాని నారాయణన్ ప్రధాన పాత్రలు పోషించారు.
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్‌లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్‌కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!