Madhya Pradesh: ప్రొఫెసర్ కళ్లల్లో కారం చల్లి.. కర్రలతో దాడి.. ఆస్పత్రికి తరలింపు
- మధ్యప్రదేశ్‌లో దారుణం
- ప్రొఫెసర్ కళ్లల్లో కారం చల్లి.. కర్రలతో దాడి
- పరిస్థితి విషమం.. ఆస్పత్రికి తరలింపు
- పాత తగాదాలతో పూర్వ విద్యార్థి దాడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మధ్యప్రదేశ్‌లోని ప్రభుత్వ జేహెచ్‌పీజీ కళాశాలలో దారుణం జరిగింది. ప్రొఫెసర్ నీరజ్ ధాకడ్ కళ్లల్లో కారం చల్లి.. కర్రలతో దాడికి తెగబడ్డారు. క్యాంపస్ ఆవరణలోనే ఈ దారుణానికి పాల్పడ్డారు. శుక్రవారం మధ్యాహ్నం ఐదు నుంచి ఏడుగురు దుండగులు కర్రలు, కారంపొడితో కళాశాల ఆవరణలోకి చొరబడి ఈ ఘాతుకానికి తెగబడ్డారు. నీరజ్ ధాకడ్ సంస్కృత విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ ఘాతుకానికి తెగబడింది.. ఓల్డ్ స్టూడెంట్‌గా గుర్తించారు. స్కాలర్‌షిప్ విషయంలో గతంలో జరిగిన గొడవను మనసులో పెట్టుకుని అన్నూ ఠాకూర్ అనే పాత విద్యార్థి ఈ దాడికి పాల్పడినట్లుగా గుర్తించారు.
ఇది కూడా చదవండి: Jangaon: ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి ధర్నా..పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం
Also Read
- Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
- Alluri District Tribal Bandh: అల్లూరి జిల్లాలో ఆదివాసీల బంద్.. స్వల్ప ఉద్రిక్తత.!
- Hyderabad: స్టేడియం వద్ద కిక్కిరిసిన నిరుద్యోగులు.. హైడ్రా ఉద్యోగాల కోసం క్యూ కట్టిన వేలాది మంది!
- Vaibhav Sooryavanshi: "ఫుడ్ విషయంలో తగ్గేదేలే".. వైభవ్ సూర్యవంశీ డైట్ సీక్రెట్ ఇదేనట..
దుండగులు ప్రొఫెసర్ ధాకడ్‌ను కర్రలతో కొట్టే ముందు కళ్లల్లోకి కారం పొడి పోసి అచేతనంగా పడి ఉన్న ప్రొఫెసర్‌పై దాడి చేశారు. అయితే చుట్టూ కాలేజీ సిబ్బంది, విద్యార్థులు ఉన్నా.. ఎవరూ పట్టించుకోలేదు. ఇందుకు సంబంధించి దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ప్రొఫెసర్ ధాకడ్ స్పృహ కోల్పోయే వరకు దాడి చేశారు. దాడి చేసినవారు పారిపోయిన తర్వాత మాత్రమే సహోద్యోగులు ప్రొఫెసర్ ధాకడ్‌కు సహాయం చేసి జిల్లా ఆసుపత్రికి తరలించారు.
ఇది కూడా చదవండి: Kalki 2898AD: కల్కి నుంచి భైరవ ఆంథమ్ ప్రోమో వచ్చేసింది చూశారా..
ప్రొఫెసర్ తల, చేతులు, కాళ్లకు పగుళ్లు ఏర్పడ్డాయి. తీవ్ర గాయాలైనట్లు వైద్య నివేదికలు నిర్ధారించాయి. దాడి చేసిన వారిలో ఒకరైన కళాశాల పూర్వ విద్యార్థి అన్ను ఠాకూర్‌కు ప్రొఫెసర్‌కు గతంలో జరిగిన వివాదమే కారణంగా తేల్చారు. నెల క్రితం ధాకడ్‌కు సంబంధించిన స్టాంప్, లెటర్ హెడ్‌ను దుర్వినియోగం చేసినట్లుగా సమాచారం. ఇదే ఘర్షణకు దారి తీసింది. సమాచారం అందుకున్న పోలీసులు.. ప్రొఫెసర్ స్టేట్‌మెంట్ ప్రకారం.. నిందితులపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజీలో ఉన్న నిందితుల్ని పట్టుకునేందుకు పోలీసులు జల్లెడపడుతున్నారు.
ఇది కూడా చదవండి: PM Kisan: రైతులకు కేంద్రం గుడ్ న్యూస్.. వచ్చే వారమే పీఎం కిసాన్ నిధులు
తాజావార్తలు
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
Fazilka Border Drone Arms Smuggling: ఫాజిల్కా సరిహద్దు వద్ద పాకిస్థాన్ కుట్ర భగ్నం.. డ్రోన్, పిస్టల్, తూటాలు స్వాధీనం
-
Hollywood Box Office: ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ vs ‘ది ఒడిస్సీ’.. షేక్ అవుతున్న బాక్సాఫీస్.. కలెక్షన్స్ లో ఎవరిది పైచేయి?
-
Irumudi Trailer: భీమవరంలో రవితేజ హంగామా.. ‘ఇరుముడి’ ట్రైలర్ రిలీజ్ అక్కడే!
-
Alluri District Tribal Bandh: అల్లూరి జిల్లాలో ఆదివాసీల బంద్.. స్వల్ప ఉద్రిక్తత.!
ట్రెండింగ్
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్‌కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!