Site icon NTV Telugu

Madhu Yashki : బీఆర్‌ఎస్‌ వైఫల్యాలపై 20 రోజుల కార్యక్రమాలు

Madhuyaskhi Goud

Madhuyaskhi Goud

తెలంగాణ దశాబ్ది వేడుకలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు నిర్ణయం తీసుకుంది. అయితే.. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ధీటుగా తెలంగాణ దశాబ్ధి వేడుకలను నిర్వహించేందుకు తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ కాంగ్రెస్‌ ప్రచార కమిటీ చైర్మన్‌ మధు యాష్కీ మాట్లాడుతూ.. ప్రతీ నెలా మొదటి వారంలో పీఏసీ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. జూన్ 2 నుండి తొమ్మిదేళ్ల లో కేసీఆర్ వైఫల్యాలపై.. ఫెయిల్యూర్ కేసీఆర్ .. స్లోగన్ తో కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. బీఆర్‌ఎస్‌ వైఫల్యాలపై 20 రోజుల కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు.

Also Read : Imran Khan: “నో-ఫ్లై” లిస్టులో ఇమ్రాన్ ఖాన్.. పాకిస్తాన్ వదిలిపోకుండా చర్యలు..

జూన్ 2న మండల కేంద్రంలో.. సోనియాగాంధీకి పాలాభిషేకం.. కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని, 20 రోజులు కాంగ్రెస్ కార్యకర్తలు ఇండ్లపై జెండాలు ఎగరేయాలన్నారు. త్వరలో బీసీ గర్జన నిర్వహించునున్నట్లు తెలిపారు. అనంతరం ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ.. ఎల్లుండి మోడీ పార్లమెంట్ భవనం ప్రారంభిస్తున్నారని, ఇది రాజ్యాంగ ఉల్లంఘన అన్నారు. పార్లమెంట్ ఎలా ఉండాలని చెప్పేది ఆర్టికల్ 79, 84 అని, పార్లమెంట్ అనేది రాష్ట్రపతి.. రాజ్యసభ.. లోక్ సభ… ఫౌండింగ్ మెంబర్స్ అని, రాష్ట్రపతిని ఆహ్వానించక పోవడం సరికాదన్నారు. అంతేకాకుండా.. కనీసం శంకుస్థాపనకి కూడా పిలవలేదని ఆయన మండిపడ్డారు. దళిత.. గిరిజన రాష్ట్రపతిలకు ఇచ్చిన గౌరవం ఇదేనా అని ఆయన ప్రశ్నించారు. మోడీ ఇప్పటి వరకు ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం చెప్పలేదని, పార్లమెంట్ అతి తక్కువ పని రోజులు పని చేసింది మోడీ హయాంలోనేనని ఆయన విమర్శలు గుప్పించారు. కొత్త బిల్లులపై అసలు చర్చ నే ఉండదన్నారు. పార్లమెంట్ అందరిదని, మోడీ ఒక్కరిదే కాదని ఆయన ఆయన వ్యాఖ్యానించారు.

Parliament Inauguration: కొత్త పార్లమెంట్‌పై దాఖలైన పిల్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు..

Exit mobile version