మియాపూర్ బెట్టింగ్ యాప్స్ కేసుల వివరాలు సేకరిస్తున్నామని మాదాపూర్ డీసీపీ వినీత్ అన్నారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన.. ముందుగా యాప్స్ నిర్వహకులకు నోటీసులు పంపి వారి వివరణ తీసుకున్నాక దర్యాప్తు ముమ్మరం చేస్తామని స్పష్టం చేశారు. ఈ కేసులో పాన్ ఇండియా స్టార్స్ ఉన్న నేపథ్యంలో లీగల్ పరిణామాలను కూడా పరిశీలిస్తున్నామని వెల్లడించారు. మోరల్ రెస్పాన్సిబిలిటీ లేకుండా సినీ సెలబ్రిటీలు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లని మియాపూర్ పోలీస్ స్టేషన్ కి పిలిపిస్తామన్నారు.
Durgam Cheruvu: దుర్గం చెరువు వద్ద ఇప్పటివరకు రెండేళ్లలో ఎనిమిది మంది ఆత్మయత్నం చేశారని మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి తెలిపారు. మాధాపూర్‌లోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకి పాయల్ అనే యువతి ఆత్మహత్యపై డీసీపీ స్పందించారు.