Madhapur AV Technologies Scam: హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఏవీ టెక్నాలజీస్ పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ఏవీ టెక్నాలజీ స్టాక్ మార్కెట్లో పెట్టు బడుల పేరుతో 1000 కోట్లు వసూలు చేసినట్లు తెలిసింది. గడ్డం వెంకట్రావు, గడ్డం వేణుగోపాలు కలిసి డబ్బులు వసూలు చేశారని చెబుతున్నారు. రెండు రాష్ట్రాల నుంచి 4500 మంది నుంచి డబ్బులు వసూలు చేశారు. ఏవీ టెక్నాలజీస్, ఐఐటీ టెక్నాలజీస్, ఏవీ రియాల్టీ పేరుతో కంపెనీలు ఏర్పాటు చేశారు. తమ ద్వారా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడితే అధిక లాభాలు ఇప్పిస్తామంటూ డబ్బులు వసూలు చేశారు.
READ MORE: Trump tariffs: భారత్, చైనాలపై 100 శాతం సుంకాలు విధించం.. ట్రంప్ మాట వినని ఈయూ..
తమ ద్వారా పెట్టిన పెట్టుబడులకు 6% చొప్పున వడ్డీ ఇస్తామంటూ మాయమాటలు చెప్పి జనాలను నమ్మించారు.
గడ్డం వేణుగోపాల్ రెండు రాష్ట్రాల నుంచి వసూలు చేసిన డబ్బులను స్టాక్ మార్కెట్లో పెట్టాడు. దాదాపు రూ. 400 కోట్ల రూపాయల వరకు తిరిగి చెల్లించకుండా మోసం చేశాడు. ఏవీ టెక్నాలజీస్ మోసంపై సైబరాబాద్ ఎకనామిక్ అండ్ ఆన్లైన్ క్రైమ్స్ వింగ్ కేసు నమోదు చేసింది. గడ్డం వేణుగోపాల్, గడ్డం వెంకట్రావుతో పాటు సీఈవో శ్రేయ పాల్ అరెస్ట్ చేశారు. వసూలు చేసిన డబ్బుల్ని విదేశాలకు మళ్లించినట్లు గుర్తించారు.
READ MORE: Pakistan: పాకిస్థాన్ పెంచి పోషించిన ఉగ్రవాదం.. ఇప్పుడు ఆదేశానికే ముప్పుగా మారిందా..?