Mystery Solved : వీడిన మడకశిర గుర్తు తెలియని శవం మిస్టరీ..!
- మిస్సింగ్ కేసుల ఆధారంగా దర్యాప్తు
- విచారణలో పోలీసులకు దొరికిన క్లూ
- భార్య విచారణతో వీడిన మిస్టరీ
- చికెన్ బిర్యానీలో నిద్రమాత్రలు కలిపి హత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mystery Solved : మడకశిర..నియోజకవర్గంలో సంచలనం సృష్టించిన గుర్తు తెలియని శవం కేసు మిస్టరీ ఎట్టకేలకు వీడింది. 2023 జనవరి 12న మడకశిర మండలం కోడిగానిపల్లి సమీపంలోని హంద్రీనీవా కాలువకు ఏర్పాటు చేసిన బ్రిడ్జి కింద గుర్తు తెలియని శవాన్ని గుర్తించారు. వీఆర్‌ఓ హారతి స్థానిక పోలీస్‌స్టేషన్ ఫిర్యాదు చేశారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
మిస్సింగ్ కేసుల ఆధారంగా ..
మడకశిర పోలీసులు వివిధ ప్రాంతాల్లోని పోలీస్‌స్టేషన్లలో నమోదైన మిస్సింగ్ కేసుల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. అప్పటి మడకశిర సీఐ సురేష్‌బాబు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆయన బదిలీపై వెళ్లిపోవడంతో ప్రస్తుత మడకశిర రూరల్ సీఐ రాజ్‌కుమార్, గుడిబండ ఎస్‌ఐ మునిప్రతాప్ కేసు దర్యాప్తు కొనసాగించారు. ఇందులో భాగంగా కర్ణాటకలోని తుమకూరు జయనగర్ పోలీస్‌స్టేషన్‌లో ఓ మిస్సింగ్ కేసు నమోదైనట్లు పోలీసులు గుర్తించారు. తుమకూరుకు చెందిన నాగరత్నమ్మ అనే మహిళ తన పెద్ద కుమారుడు మోహన్‌కుమార్ (52) తప్పిపోయినట్లు 2023 జనవరి 21న జయనగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన వివరాలను మడకశిర పోలీసులు సేకరించారు. ఆ తర్వాత శవం ఫొటోను నాగరత్నమ్మకు చూపించగా మృతుడు తన పెద్ద కుమారుడేనని గుర్తు పట్టింది. మృతుడి సోదరులైన అరుణ్‌కుమార్, కిరణ్‌కుమార్‌లను కూడా మడకశిర పోలీసులు విచారించారు. తప్పిపోవడానికి కారణాలను అడిగి తెలుసుకున్నారు.
Also Read
- Abhijit Dipke: "నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ చేశారు".. కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు సంచలన ఆరోపణలు
- Kashmiri Beauty Secrets: మేకప్ లేకుండానే గులాబీ బుగ్గలు.. కాశ్మీరీ మహిళల సౌందర్య రహస్యాలు మీకోసం..
- Best Parathas for Summer: మీరు పరోటా ప్రేమికులా..? వేసవిలో ఆరోగ్యానికి బెస్ట్ పరోటాలు ఇవే.. రుచితో పాటు శరీరానికి చల్లదనం
- Delhi Heatwave: ఢిల్లీలో నిప్పుల కొలిమి.. తారు రోడ్ల ఏకంగా 65°C ఉష్ణోగ్రత నమోదు!
విచారణలో పోలీసులకు దొరికిన క్లూ
మృతుడి తల్లి, సోదరుల విచారణలో ఈ కేసుకు సంబంధించిన పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. మృతుడికి, అతని భార్య కవితకు మనస్పర్థలు ఉన్నాయి. దీంతో మృతుడి భార్య ఇంటి నుంచి వెళ్లిపోయి తుమకూరులోనే శిరా గేట్‌లో వేరుగా తన కుమారుడు కౌశిక్, కుమార్తె దీక్షితతో కలిసి ఉంటోందని వారు పోలీసులకు వివరాలు అందించారు. ఈవివరాల మేరకు మడకశిర పోలీసులు మృతుడి భార్య కవితను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేశారు.
భార్య విచారణతో వీడిన మిస్టరీ
మృతుడి భార్య కవితను పోలీసులు విచారణ చేయడంతో మోహన్‌కుమార్‌ను హత్య చేసినట్లు తేలింది. కవితకు తుమకూరు జిల్లా గుబ్బిలో పనిచేసే విద్యుత్‌శాఖ జేఈగా పని చేసే అక్తర్‌పాషాతో ఆరేళ్లుగా వివాహేతర సంబంధం ఉంది. అతనితో సహ జీవనం కూడా చేసేది. అక్తర్‌పాషాతో కవిత డబ్బులు ఇప్పించుకుని తుమకూరులోనే ఓ హోటల్ పెట్టింది. ఈ క్రమంలో మృతుడు మోహన్‌కుమార్ పలుసార్లు హోటల్ వద్దకు వెళ్లి భార్య కవిత, ప్రియుడు అక్తర్‌పాషా, హోటల్‌లో పని చేసే వంట మనిషి మోహన్‌ప్రసాద్, కుమారుడు కౌశిక్‌ను దూషించేవాడు. తన ఆస్తిని మీకు ఇవ్వనని, తన సోదరులకు ఇస్తానని భార్య, కుమారుడితో గొడవ పడేవాడు. ఈ నేపథ్యంలో భార్య కవిత, కుమారుడు కౌశిక్, ప్రియుడు అక్తర్‌పాషాలు మోహన్‌కుమార్‌ను చంపడానికి నిర్ణయం తీసుకున్నారు. దీనికి హోటల్ వంట మనిషి మోహన్‌ప్రసాద్‌తో సుపారీ మాట్లాడారు. రూ.లక్షకు ఒప్పందం చేసుకొని రూ.50 వేలు అడ్వాన్స్‌గా ఇచ్చారు.
చికెన్ బిర్యానీలో నిద్రమాత్రలు కలిపి హత్య
పథకం ప్రకారం కుమార్తె దీక్షతకు ఆరోగ్యం బాగా లేదని మోహన్‌కుమార్‌ను భార్య కవిత 2023 జనవరి 11న రాత్రి 9 గంటల సమయంలో ఫోన్ చేసి ఇంటికి పిలిపించింది. చికెన్ బిర్యానీలో నిద్రమాత్రలు వేసి మోహన్‌కుమార్‌కు పెట్టారు. భోజనం చేసిన తర్వాత మృతుడు మత్తులోకి పోయాడు. ఈక్రమంలో భార్య కవిత, కుమారుడు కౌశిక్, వంట మనిషి మోహన్‌ప్రసాద్… మోహన్‌కుమార్ తలపై రోకలిబండతో కొట్టారు. మృతుడి భార్య ప్రియుడు అక్తర్‌పాషా కత్తితో గొంతుకోశారు. మోహన్‌కుమార్ మృతి చెందగా శవాన్ని ఓ ప్లాస్టిక్ సంచిలో కట్టి వంట మనిషి ఓ కారులో వేసుకుని మడకశిర మండలంలోని కోడిగానిపల్లి హంద్రీనీవా కాలువ బ్రిడ్జి కింది భాగాన పడేసి వెళ్లారు.
నలుగురు నిందితుల అరెస్ట్
పెనుకొండ డీఎస్పీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో మడకశిర రూరల్ సీఐ రాజ్‌కుమార్, గుడిబండ ఎస్‌ఐ మునిప్రతాప్ సిబ్బంది ఆదివారం నిందితులను తుమకూరులో అరెస్ట్ చేశారు. శవాన్ని తరలించడానికి ఉపయోగించిన కారు, మరణాయుధాలు కూడా సీజ్ చేశారు. నిందితులైన కవిత, అక్తర్‌పాషా, కౌశిక్, మోహన్‌ప్రసాద్‌లను కోర్టులో హాజరుపరచనున్నట్లు పేర్కొన్నారు. కేసును చాకచక్యంగా ఛేదించిన సీఐ రాజ్‌కుమార్, ఎస్‌ఐ మునిప్రతాప్ తదితర పోలీసులను ఎస్పీ రత్న అభినందించినట్లు పెనుకొండ డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు.
తాజావార్తలు
-
Abhijit Dipke: “నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ చేశారు”.. కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు సంచలన ఆరోపణలు
-
Donald Trump: ట్రంప్ కుమార్తెను చంపేందుకు కుట్ర!.. ఖాసిం సులేమానీ మరణానికి ఐఆర్జిసి ప్రతీకార ప్లాన్
-
Kashmiri Beauty Secrets: మేకప్ లేకుండానే గులాబీ బుగ్గలు.. కాశ్మీరీ మహిళల సౌందర్య రహస్యాలు మీకోసం..
-
Aishwarya Rai: 1500 గంటల హ్యాండ్‌వర్క్.. కేన్స్‌లో ఐశ్వర్య లుక్ ఇంటర్నెట్ షేక్
-
Best Parathas for Summer: మీరు పరోటా ప్రేమికులా..? వేసవిలో ఆరోగ్యానికి బెస్ట్ పరోటాలు ఇవే.. రుచితో పాటు శరీరానికి చల్లదనం
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్‌తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!