MAD : ఓటీటీ లో కి వచ్చేస్తున్న ఫన్ టాస్టిక్ మూవీ..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మ్యాడ్ మూవీ.. రీసెంట్ గా విడుదలయిన ఈ యూత్ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది.యూత్ కు ఈ సినిమా బాగా కనెక్ట్ అయింది..ఈ ఫన్ టాస్టిక్ ఎంటర్‌టైనర్ ను టాలీవుడ్ టాప్ డైరెక్టర్ త్రివిక్రమ్ సతీమణి సాయిసౌజన్య తో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మించింది.మ్యాడ్ మూవీతో ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాలో సంగీత్ శోభన్, రామ్ నితిన్, శ్రీ గౌరిప్రియారెడ్డి, అనంతిక మరియు గోపికా ఉద్యాన్ ప్రధాన పాత్రలలో నటించి మెప్పించారు… ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా రిలీజైన మ్యాడ్ బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్‌గా నిలిచింది.డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ క్రియేట్ చేసిన కామెడీ ప్రేక్షకులని ఎంతగానో నవ్వించింది.
సినిమా లోని పంచ్ డైలాగ్స్ థియేటర్లలో ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. రెండున్నర కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజైన ఈ మూవీ 25 కోట్లకుపైగా గ్రాస్‌ను, 12 కోట్ల కు పైగా షేర్‌ను రాబట్టింది. మ్యాడ్ మూవీ నిర్మాతలకు మూడింతల లాభాల్ని మిగిల్చింది. మ్యాడ్ మూవీ లో డైరెక్టర్ కేవీ అనుదీప్ కూడా అతిథి పాత్ర లో కనిపించి అలరించాడు… భీమ్స్ సిసిరోలియో మ్యాడ్ మూవీకి సంగీతాన్ని అందించాడు.థియేటర్స్ లో అదరగొట్టిన ఈ బ్లాక్‌బస్టర్ మూవీ ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధం అయింది..నవంబర్ 3న నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ రిలీజ్ కానున్నట్లు సమాచారం.అయితే ఓటీటీ రిలీజ్ డేట్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ త్వరలోనే రానున్నట్లు తెలిసింది. ఈ సినిమా కథ విషయానికి వస్తే..మనోజ్ (రామ్ నితిన్)అశోక్ (నార్నే నితిన్) దామోదర్ (సంగీత్ శోభన్) అనే ముగ్గురు ఇంజినీరింగ్ స్టూడెంట్స్ కాలేజీ లైఫ్ గురించి మ్యాడ్ సినిమా తెరకెక్కింది. కాలేజీ లైఫ్‌తో పాటు వారి ప్రేమకథల్లో ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయి అనే కథ ను డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ వినోదాత్మకం గా తెరకెక్కించారు..
Also Read
- 200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
- Shreyas Iyer: "ఆ ఇద్దరి వల్లే మ్యాచ్ ఓడిపోయాం".. కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
- CJP Protest: ఢిల్లీలో హై అలర్ట్.. ఇంటర్నెట్ బంద్, మెట్రో స్టేషన్ల మూసివేత.. రంగంలోకి 35,000 మంది భద్రతా సిబ్బంది
- Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
తాజావార్తలు
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
MS Dhoni: ఐపీఎల్ బెట్టింగ్ కేసు.. ఎంఎస్ ధోనీకి హైకోర్టు నోటీసులు!
-
Shreyas Iyer: “ఆ ఇద్దరి వల్లే మ్యాచ్ ఓడిపోయాం”.. కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
-
Saturday Horoscope: శనివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
-
CJP Protest: ఢిల్లీలో హై అలర్ట్.. ఇంటర్నెట్ బంద్, మెట్రో స్టేషన్ల మూసివేత.. రంగంలోకి 35,000 మంది భద్రతా సిబ్బంది
ట్రెండింగ్
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!