కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరులో కె. తిమ్మాపురం గ్రామంలో డాక్టర్ మాచాని సోమనాథ్ ( Machani Somnath) బాబు షూరిటీ- భవిష్యత్తుకు గ్యారంటీపై ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో సీఎం జగన్ ( cm jagan ) అరాచక పాలన కొనసాగిస్తూ.. ధన యజ్ఞానికి పాల్పడుతూ.. జలయజ్ఞాన్ని పూర్తిగా విస్మరించి రైతును దగా చేశారని దుయ్యపడ్డారు. డాక్టర్ మాచాని సోమనాథ్ ను కర్నూల్ ( Karnool ) పార్లమెంటు నియోజకవర్గం టీడీపీ కురువ సాధికారిక కమిటీ సభ్యులు అడ్వకేట్ కేటి మల్లికార్జున ఆధ్వర్యంలో భారీగా ఊరేగింపు నిర్వహించారు. పెద్ద ఎత్తున బాణాసంచా పేలుస్తూ ఆయనకు ఘన స్వాగతం పలికారు.
Read Also: Nikki Haley: అమెరికా అధ్యక్ష బరి నుంచి నిక్కీ హేలీ నిష్క్రమణ!
ఇక, వందలాదిమంది టీడీపీ ( TDP) కార్యకర్తలు మాచాని సోమనాథ్ కి బ్రహ్మరథం పట్టారు. ఇక, ఆయన మహర్షి వాల్మీకి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామంలోని ప్రసిద్ధిగాంచిన శ్రీ శ్రీ ఈశ్వర దేవాలయం నందు చంద్రబాబు ( Chandrababu) ముఖ్యమంత్రి కావాలని ప్రత్యేక పూజలు చేశారు. జగన్ ఐదేళ్ల పాలనలో అన్నదాతలు తీవ్ర సంక్షోభంలో కూరుకు పోయారు.. పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడంతో వారికి ఆత్మహత్యలు శరణ్యంగా మారిపోయాయని ఆవేదన చెందారు. రైతు భరోసాను దగా చేయడమే కాకుండా మోటార్లకు మీటర్లు పెడుతూ రైతుల మెడకు ఉరితాడు బిగిస్తున్నారని ఆరోపించారు. రూ. 3 వేల కోట్లతో ధరల స్థిరకరణ నిధి, రూ.4 వేల కోట్లతో.. ప్రకృతి విపత్తుల నిధి ఏర్పాటు హామీ ఇచ్చి నేడు అమలు చేయకుండా మోసం చేశారని ఆవేదన చెందారు.
Read Also: IND Vs ENG 5th Test: ప్రకృతి ఒడిలో ఎంజాయ్ చేస్తున్న ఇంగ్లాండ్ క్రికెటర్లు..
ఆర్బీకేల ( RBK ) పేరుతో ఆర్భాటం తప్ప రైతుకు ఒరిగిందేమీ లేదని మాచాని సోమనాథ్ అన్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన హాయంలో రూ.68,293,94 కోట్ల వ్యయంతో రాష్ట్రవ్యాప్తంగా 62 ప్రాజెక్టులను చేపట్టి, 23 ప్రాజెక్టులను పూర్తి చేసి 32.02 లక్షల ఎకరాలకు ఆయకట్టు స్థిరీకరణ, 7 లక్షల ఎకరాలకు నూతన ఆయకట్టుకు సాగునీరు అందించి వ్యవసాయ రంగంలో.. రైతాంగాన్ని ఆదుకున్నారని ఆయన చెప్పుకొచ్చారు. ఈ ఎన్నికల్లో రైతు మోసపోకుండా జగన్ ను సాగనంపి చంద్రబాబుకు పట్టం కట్టాలని పిలుపునిచ్చారు.. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరవీటి సుధాకర్ శెట్టి, కదిరికోట ఆదెన్న, మాజీ జిల్లా వక్ఫ్ బోర్డు డైరెక్టర్ జి.అల్తాఫ్, మాజీ ఆత్మ చైర్మన్ కందనాతి శ్రీనివాసులు, కె. తిమ్మాపురం గ్రామ టిడిపి నాయకులు బి.జి. చంద్రన్న, బీటీ చిన్న హనుమంతు, ఉప్పర వీరేష్, ఈడిగ నరసప్ప, సాయి పోగు మార్కు, చాకలి శంకరన్న తదితరులు పాల్గొన్నారు.