IND Vs ENG 5th Test: ప్రకృతి ఒడిలో ఎంజాయ్ చేస్తున్న ఇంగ్లాండ్ క్రికెటర్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dharamshala Test: ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం భారత్‌లో పర్యటిస్తున్న ఇంగ్లండ్ ( England ) క్రికెట్ టీమ్ మరో మ్యాచ్ మిగిలుండగానే 1-3 తేడాతో సిరీస్‌ను చేజార్చుకుంది. ఇక, సిరీస్‌లోని చివరి మ్యాచ్ ధర్మశాల వేదికగా రేపటి నుంచి (మార్చి 7) స్టార్ట్ కానుంది. ఈ మ్యాచ్‌కు ముందు లభించిన విరామ సమయాన్ని ఇంగ్లండ్ క్రికెటర్లు చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నారు. ప్రకృతి ఒడిలో సేద తీరుతూ చిల్ అవుతున్నారు. ఇంగ్లండ్ వెటరన్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ సహచర క్రికెటర్లతో కలిసి స్థానిక జలపాతంలో రీఫ్రెష్ అవుతూ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా( Social Media) లో వైరల్ అవుతున్నాయి.
Read Also: Nikki Haley: అమెరికా అధ్యక్ష బరి నుంచి నిక్కీ హేలీ నిష్క్రమణ!
Also Read
- IPl 2027: ఐపీఎల్ 2027పై కీలక అప్డేట్.. సమావేశం వాయిదా..
- World Standards Day : మనం కొనే వస్తువులు నాణ్యమైనవేనా? ప్రతి వస్తువు వెనుక ఉన్న అసలు కథ ఇదే.!
- AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
- AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ఇక, ఇంగ్లీష్ ఆటగాళ్లు సిరీస్ ఓటమిని సైతం మరిచిపోయి ప్రకృతిని ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడి వాతావరణం వారికి బాగా నచ్చినట్లుంది. హిమాచల్ ప్రదేశ్ ( Himachal Pradesh ) శీతల రాజధాని అయిన ధర్మశాల ఇంగ్లండ్ పరిస్థితులకు చాలా దగ్గరగా ఉంటుంది. ఈ ప్రాంతం ప్రకృతి సౌందర్యానికి కూడా పెట్టింది పేరు.. అయితే, ఇక్కడి జలపాతాలు, ఎత్తైన మంచు కొండలు భూతల స్వర్గాన్ని తలపిస్తాయి. అందుకే ఈ ప్రాంతం ఇంగ్లాండ్ క్రికెటర్లకు స్వదేశానుభూతిని కలిగించినట్లుంది.
Read Also: MP Margani Bharat: బైక్స్పై రాజమండ్రి నుంచి అయోధ్యకు యువకులు.. ఆల్ దీ బెస్ట్ చెప్పిన ఎంపీ
అయితే, ఇదిలా ఉంటే, భారీ అంచనాల నడుమ భారత్‌లో అడుగు పెట్టిన ఇంగ్లండ్ క్రికెట్ టీమ్ పేలవ ప్రదర్శనతో సొంత అభిమానులను నిరుత్సాహర్చింది. బజ్‌బాల్ అంటూ ఊదరగొట్టిన వీరు రోహిత్ ( Rohit Sharma) సేన దెబ్బకు తోకముడిచారు. బెన్ డకెట్, ఓలీ పోప్, రూట్ సెంచరీలు మినహా ఈ సిరీస్‌లో ఇంగ్లండ్‌కు చెప్పకోదగ్గ ప్రదర్శనలు ఏమీ లేవు.. స్టార్లతో నిండిన జట్టు నుంచి ఊహించని ప్రదర్శనతో భారత (Team India ) క్రికెట్ అభిమానులు సైతం అసంతృప్తిగా ఉన్నారు.
England cricketer James Anderson and his teammates enjoying a refreshing dip in a local khadd in Dharamshala 😍 pic.twitter.com/JQravFPLvM
— Go Himachal (@GoHimachal_) March 6, 2024
తాజావార్తలు
-
IPl 2027: ఐపీఎల్ 2027పై కీలక అప్డేట్.. సమావేశం వాయిదా..
-
Health News: చిన్నతనంలోనే క్యాన్సర్? ఇలా గుర్తించండి
-
Explainer: TVS ఫ్యామిలీ గొడవేంటి?
-
World Standards Day : మనం కొనే వస్తువులు నాణ్యమైనవేనా? ప్రతి వస్తువు వెనుక ఉన్న అసలు కథ ఇదే.!
-
Be Bald and Be Free Day : బట్టతల అంటే అందమే.. ఆత్మవిశ్వాసానికి కొత్త నిర్వచనం
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!