Uttarpradesh : ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో కుటుంబం మొత్తం మృత్యువాత పడింది. అర్థరాత్రి ఒక ట్రక్కు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న గుడిసెపైకి బోల్తా పడింది. ఆ సమయంలో గుడిసెలో ఒక కుటుంబం నిద్రపోతోంది. ప్రమాదంలో కుటుంబం మొత్తం ప్రాణాలు కోల్పోయింది. చనిపోయిన వారిలో నీలమ్ దేవి అనే 8 నెలల నిండు గర్భిణి కూడా ఉన్నారు. ఈ ప్రమాదంలో నీలం, ఆమెకు పుట్టబోయే బిడ్డ, భర్త ఉమేష్, ఇద్దరు కుమారులు గోలు, సన్నీ కూడా మరణించారు. ఈ ప్రమాదంలో 8 నెలల గర్భిణి నీలమ్ కడుపు పగిలిపోవడం బాధాకరం. కడుపు పగిలి పిండం బయటకు వచ్చింది.
Read Also: Committee Kurrollu: ఆగష్టు 9న థియేటర్లలోకి వచ్చేస్తున్న కమిటీ కుర్రోళ్లు..
వీరంతా బారాబంకి జిల్లా వాసులు. మృతుడు ఉమేష్ జీవనోపాధి కోసం మట్టి పాత్రలు తయారు చేయడంతోపాటు టైల్స్ చేసేవాడు. అతనితో పాటు అతని భార్య , ఇద్దరు కుమారులు ఇక్కడ నివసించారు. ఉమేష్ భార్య నీలం గర్భవతి. వచ్చే నెలలో ఆమె చిన్న పాపకు జన్మనివ్వబోతోంది. చిన్న అతిథి గురించి కుటుంబ సభ్యులు చాలా సంతోషించారు. అయితే అర్థరాత్రి జరిగిన ఘోర ప్రమాదంలో కుటుంబం మొత్తం చనిపోయారు. మొరం లోడ్ చేసిన ట్రక్ అర్థరాత్రి గుడిసెపైకి బోల్తా పడడంతో నిద్రలోనే అందులో నివసించే వారంతా మరణించారు. పెద్ద శబ్ధం రావడంతో స్థానికులు ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. ఉమేష్ కుటుంబాన్ని ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. కానీ అప్పటికి చాలా ఆలస్యమైంది. కుటుంబం మొత్తం చనిపోయింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికుల సహకారంతో బోల్తా పడిన లారీని పైకి లేపి కింద ఇరుక్కున్న మృతదేహాలను బయటకు తీశారు.
Read Also:MP Sanjay Singh: సీఎం కేజ్రీవాల్‌ను చంపేందుకు బీజేపీ కుట్ర చేస్తోంది..
లారీ డ్రైవర్‌కు కూడా గాయాలు
ఈ ప్రమాదంలో ట్రక్కు డ్రైవర్‌కు కూడా గాయాలు కావడంతో అతన్ని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో చేర్చారు. మృతుడి కుటుంబీకులు ఫిర్యాదు చేశారని, ఆ తర్వాత ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు బీబీడీ పోలీస్ స్టేషన్ పోలీసులు తెలిపారు. ట్రక్కును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యలు కొనసాగుతున్నాయి.