IPL 2023: లక్నోను ఆదుకున్న పూరన్.. కేకేఆర్ ఎదుట భారీ టార్గెట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్లేఆఫ్స్ రేసులో కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ టాపార్డర్ మరోసారి విఫలమైంది. దీంతో నికోలస్ పూరన్ (30 బంతుల్లో 58, 4 ఫోర్లు, 5 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో ఆ జట్టు ఆదుకున్నాడు. దీంతో కోల్ కతా నైట్ రైడర్స్ ఎదుట ఊరించే టార్గెట్ పెట్టింది. నిర్ణీత 20 ఓవర్లలో లక్నో.. 8 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. ఫస్ట్ నుంచే లక్నో బ్యాటర్లను నిలువరించిన కేకేఆర్ బౌలర్లు.. ఆ జట్టును భారీ స్కోరు చేయకుండా అడ్డుకట్ట వేశారు. ఇక ఈ మ్యాచ్ లో లక్నో ఓడిపోతే ప్లేఆఫ్స్ రేసులో లక్నోకు కష్టంగా మారుతుంది..
Also Read : Venkatesh: ఎన్టీఆర్ తో సినిమా చేయలేదు అన్న బాధ.. అందుకే ఆ పని చేశా
Also Read
- Pakistan: "మక్కా ఒప్పందం అండగా లేదు".. సౌదీ-హౌతీ వార్‌లో పాకిస్తాన్ డ్యామెజ్ కంట్రోల్..
- Trump-Jinping: సెప్టెంబర్ 24న వైట్‌హౌస్‌లో ట్రంప్‌తో జిన్‌పింగ్ భేటీ.. కీలక అజెండా ఇదేనా?
- SKY: సూర్యకుమార్ యాదవ్ 36వ పుట్టినరోజు.. 'మిస్టర్ 360' అరుదైన రికార్డుల ప్రయాణం ఇలా..
- CM Revanth Reddy: బాహుబలి సీన్‌ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
టాస్ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన లక్నో సూపర్ జెయింట్స్‌కు హర్షిత్ రాణా మూడో ఓవర్లోనే షాకిచ్చాడు. రాణా వేసిన మూడో ఓవర్ మూడో బాల్‌కు లక్నో ఓపెనర్ కరణ్ శర్మ (3) శార్దూల్ ఠాకూర్‌కు క్యాచ్ ఇచ్చి ఫస్ట్ వికెట్‌గా వెనుదిరిగాడు. కరణ్ నిష్క్రమించినా క్వింటన్ డికాక్ (27 బంతుల్లో 28, 2 సిక్సర్లు), ప్రేరక్ మన్కడ్ (20 బంతుల్లో 26, 5 ఫోర్లు) లక్నో ఇన్సింగ్స్ ను నడిపించారు. ఈ ఇద్దరూ రెండో వికెట్ కు 41 పరుగులు జోడించారు. కానీ రెండు ఓవర్ల వ్యవధిలో లక్నోకు భారీ షాకులు తాకాయి.
Also Read : MSDhoni: ధోని కోసం ఢిల్లీ వీధుల్లో అభిమానుల హంగామా..
73 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన లక్నోను నికోలస్ పూరన్, అయుష్ బదోని (21 బంతుల్లో 25, 2 ఫోర్లు, 1 సిక్స్) లు ఆదుకున్నారు. ఈ ఇద్దరూ కలిసి ఆరో వికెట్ కు 74 పరుగులు జోడించారు. ఎప్పటిలాగే పూరన్ ధాటిగా ఆడాడు. డికాక్ అవుట్ అయిన తర్వాత అతడి స్థానంలో వచ్చిన పూరన్.. తాను ఎదుర్కున్న మొదటి మూడు బంతులకే 4, 4, 6 కొట్టాడు. సుయాశ్ శర్మ వేసిన 15వ ఓవర్లో కూడా 6, 4 బాదాడు. నరైన్ వేసిన 18వ ఓవర్లో బదోని.. శార్దూల్ ఠాకూర్ కు క్యాచ్ ఇచ్చాడు.. ఇక శార్దూల్ ఠాకూర్ వేసిన 19వ ఓవర్లో ఫస్ట్ బాల్ కు భారీ సిక్సర్ బాదిన పూరన్ 28 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కానీ ఇదే ఓవర్లో మూడో బాల్ కు వెంకటేశ్ అయ్యర్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. ఇదే ఓవర్లో రవి బిష్ణోయ్ (2) కూడా ఔటయ్యాడు. ఆఖరి ఓవర్లో రసెల్ 13 పరుగులివ్వడంతో లక్నో స్కోరు 176 పరుగులు చేసింది.
తాజావార్తలు
-
Pakistan: “మక్కా ఒప్పందం అండగా లేదు”.. సౌదీ-హౌతీ వార్‌లో పాకిస్తాన్ డ్యామెజ్ కంట్రోల్..
-
Trump-Jinping: సెప్టెంబర్ 24న వైట్‌హౌస్‌లో ట్రంప్‌తో జిన్‌పింగ్ భేటీ.. కీలక అజెండా ఇదేనా?
-
SKY: సూర్యకుమార్ యాదవ్ 36వ పుట్టినరోజు.. ‘మిస్టర్ 360’ అరుదైన రికార్డుల ప్రయాణం ఇలా..
-
Asia Cup Trophy Row: అది ప్లేయర్స్ నిర్ణయం కాదు.. బీసీసీఐది!
-
Tharun – Eesha: జంటగా గణపయ్య పూజలో తరుణ్ భాస్కర్ – ఈషా రెబ్బ ! ఇక పెళ్లికి అఫీషియల్ ప్రకటన వచ్చినట్లేనా ?
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!