LSG vs RR Playing XI: తిరిగి విజయాల ట్రాక్ ఎక్కేదెవరో.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
LSG vs RR Playing XI: ఐపీఎల్ 2026లో వరుసగా మూడు ఓటములతో కష్టాల్లో ఉన్న లక్నో సూపర్ జెయింట్స్ (LSG), మరోవైపు మంచి ఆరంభం తర్వాత రెండు మ్యాచ్‌లు కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్ (RR) ఈ రెండు జట్లు బుధవారం లక్నోలో తలపడనున్నాయి. ఇరు జట్లు తిరిగి గెలుపు దారిలోకి రావాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతున్నాయి.
రాజస్థాన్ జట్టులో ఓపెనర్లు యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ మంచి ఫామ్‌లో ఉన్నారు. వీరిద్దరూ జట్టుకు మంచి ఆరంభాలను అందిస్తున్నారు. వీరి తర్వాత కీపర్ ధృవ్ జురెల్ కూడా మంచి స్ట్రైక్ రేట్ తో సహకరిస్తున్నాడు. అయితే మిడిల్ ఆర్డర్ మాత్రం తీవ్రంగా నిరాశపరుస్తోంది. కెప్టెన్ రియాన్ పరాగ్ ఇప్పటివరకు కేవలం 61 పరుగులు మాత్రమే చేయగా, డేరింగ్ అండ్ డాషింగ్ బ్యాట్సమెన్ హెట్మేయర్ 39 పరుగులకే పరిమితమయ్యాడు. ఇక బౌలింగ్ విభాగంలో జొఫ్రా ఆర్చర్, నాండ్రే బర్గర్, రవి బిష్ణోయ్ కలిసి 24 వికెట్లు తీసి మంచి ఫామ్‌లో ఉన్నారు. యశ్ రాజ్ పూనియా కూడా స్పిన్‌లో మెప్పిస్తున్నాడు.
Also Read
Today Astrology: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఆకస్మిక ధన లాభం!
మరోవైపు లక్నో జట్టులో బ్యాటింగ్ పూర్తిగా ఫామ్ కోల్పోయింది. నికోలస్ పూరన్ సగటు కేవలం 8.5 మాత్రమే ఉందంటే పరిస్థితి ఎలా ఉందొ అర్థమవుతుంది. కెప్టెన్ రిషబ్ పంత్ కూడా ఒకే ఒక్క హాఫ్ సెంచరీ తప్ప మిగతా మ్యాచ్‌ల్లో నిరాశపరిచాడు. ముకుల్ ఒక్క మ్యాచ్‌లో చేసిన భారీ ఇన్నింగ్స్ వల్ల మాత్రమే సగటు మెరుగ్గా కనిపిస్తోంది. LSGకి ఒకే ప్లస్ పాయింట్ వారి పేస్ బౌలింగ్. మహమ్మద్ షమీ, మోహ్సిన్ ఖాన్ లు మంచి ఆరంభం ఇచ్చినా ఇటీవల వికెట్లు తీయడంలో విఫలమవుతున్నారు.
ప్లేయింగ్ XI అంచనా:
లక్నో సూపర్ జెయింట్స్ (LSG):
అయుష్ బడోని, మిచెల్ మార్ష్, రిషభ్ పంత్ (సి & WC), నికోలస్ పూరన్, ఐడెన్ మార్క్రమ్, ముకుల్ చౌధరి, మొహమ్మద్ షమీ, అవేశ్ ఖాన్, ప్రిన్స్ యాదవ్, మనీమరన్ సిద్ధార్థ్, మోహ్సిన్ ఖాన్
ఇంపాక్ట్ సబ్: అబ్దుల్ సమద్
Abhishek Sharma సెంచరీ దెబ్బ.. రికార్డులు అబ్బా.. బద్దలైన రికార్డులు ఇవే..!
రాజస్థాన్ రాయల్స్ (RR):
వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్, ధృవ్ జురెల్ (W), రియాన్ పరాగ్ (C), షిమ్రోన్ హెట్‌మైర్, డోనోవన్ పేరేమిరా, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, నాండ్రే బర్గర్, బ్రిజేష్ శర్మ, రవి బిష్ణోయ్
Impact Sub: యశ్ రాజ్ పూనియా
హెడ్ టు హెడ్:
ఇప్పటివరకు ఈ రెండు జట్లు 6 సార్లు తలపడ్డాయి. ఇందులో
RR గెలుపులు: 4
LSG గెలుపులు: 2
తాజావార్తలు
-
Kriti Sanon: సంస్కృతి గుండెల్లో ఉంటుంది, దుస్తుల్లో కాదు.. ట్రోలింగ్ పై కృతి సనన్ స్ట్రాంగ్ కౌంటర్!
-
TVS iQube MillionR Edition: 145KM రేంజ్‌తో TVS iQube కొత్త అవతార్.. 35.5L స్టోరేజ్, USB-C పోర్ట్‌తో MillionR Edition!
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Sobhita Dhulipala: ఒక హీరోతో ఇలా పెళ్లి జరుగుతుందని ఎప్పుడూ అనుకోలేదు: శోభితా ధూళిపాళ్ల
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని శుభాలే, స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు!
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!