Abhishek Sharma సెంచరీ దెబ్బ.. రికార్డులు అబ్బా.. బద్దలైన రికార్డులు ఇవే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Abhishek Sharma: మంగళవారం (ఏప్రిల్ 21) హైదరాబాద్ లో జరిగిన ఐపీఎల్ 2026 మ్యాచ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఓపెనర్ అభిషేక్ శర్మ సెంచరీతో అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఢిల్లీ క్యాపిటల్స్ పై అతడు 68 బంతుల్లో 135 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీనితో SRH జట్టును 242/2 అనే భారీ స్కోర్‌కు తీసుకెళ్లాడు. నితీష్ రాణా బౌలింగ్‌లో సిక్స్ కొట్టి కేవలం 47 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసిన అభిషేక్ ఈ ఐపీఎల్ లో రెండో సెంచరీని అందుకున్నాడు. ఈ ఇన్నింగ్స్‌తో అతడు ఐపీఎల్ చరిత్రలో ఎన్నో రికార్డులను బద్దలు కొట్టాడు. మరి అవేంటో చూసేద్దామా..
Today Astrology: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఆకస్మిక ధన లాభం!
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
50 బంతుల లోపు సెంచరీలు చేసిన తొలి భారతీయుడు:
ఈ ఇన్నింగ్స్‌తో అభిషేక్ శర్మ ఐపీఎల్‌లో 50 బంతుల లోపు రెండు సెంచరీలు చేసిన తొలి భారత ఆటగాడిగా నిలిచాడు. గతంలో 2025లో పంజాబ్ కింగ్స్ పై కేవలం 40 బంతుల్లో చేసిన సెంచరీతో ఇప్పటికే రికార్డు సృష్టించాడు. ఈ ఘనతతో విరాట్ కోహ్లీ సరసన నిలిచాడు.
ఐపీఎల్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్లు:
అభిషేక్ శర్మ ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ల టాప్ 5 జాబితాలో మరోసారి చోటు సంపాదించాడు. టాప్ 5 అత్యధిక వ్యక్తిగత స్కోర్ల లిస్ట్ ఇదిగో..
175* – క్రిస్ గేల్
158* – బ్రెండన్ మెకల్లమ్
141 – అభిషేక్ శర్మ (2025)
140* – క్వింటన్ డి కాక్
135* – అభిషేక్ శర్మ (2026)
ఈ జాబితాలో రెండు సార్లు చోటు సంపాదించిన ఏకైక ఆటగాడు కూడా అభిషేక్ కావడం విశేషం.
OTR: సీఎం ప్రెస్ మీట్ లో NDSA ఛైర్మన్ ఉండటంపై బీజేపీ అభ్యంతరం
భారతీయులలో అత్యధిక స్కోర్లు:
ఐపీఎల్‌లో భారతీయ బ్యాటర్లలో అత్యధిక స్కోర్లు సాధించిన బ్యాటర్ కూడా అభిషేక్ పేరిటే ఉన్నాయి.
141 (55) – పంజాబ్ కింగ్స్‌పై (2025)
135* (68) – ఢిల్లీ క్యాపిటల్స్‌పై (2026)
ఈ సీజన్‌లో అభిషేక్ శర్మ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ చరిత్రలోనే వేగవంతమైన అర్ధశతకం (15 బంతుల్లో) సాధించాడు. పవర్‌ప్లేల్లో దూకుడు ప్రదర్శనతో ప్రత్యర్థి బౌలర్లపై ఒత్తిడి పెంచుతున్నాడు. ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్‌ను కూడా తన సహచరుడు హేన్రిచ్ క్లాసేన్ ను దాటి అందుకున్నాడు.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!