LSG vs DC: ఐపీఎల్ 2025లో భాగంగా నేడు లక్నోలో జరిగిన 40వ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ (DC) బౌలింగ్ ఎంచుకోగా.. ముకేష్ కుమార్ అద్భుతమైన బౌలింగ్‌తో నాలుగు వికెట్లు తీసి లక్నోను తక్కువ పరుగులకే పరిమితం చేసాడు. ఇక LSG బ్యాటింగ్ విషయానికి వస్తే.. ఒపెనర్లు ఆకట్టుకోగా, తర్వాతి బ్యాట్స్‌మెన్ అంతగా రాణించలేకపోయారు. ఐడెన్ మార్క్రామ్ 33 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 52 పరుగులు, మరోవైపు మిచెల్ మార్ష్ 36 బంతుల్లో 45 పరుగులతో ఆకట్టుకున్నాడు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్‌కు 87 పరుగులు జోడించారు. కానీ మధ్యలో వికెట్లు త్వరితగతిన పడిపోవడం వల్ల స్కోరు నెమ్మదించిపోయింది. నికోలస్ పూరన్ (9), అబ్దుల్ సమద్ (2), రిషభ్ పంత్ (0) వరుసగా వెనుదిరిగారు. చివర్లో ఆయుష్ బడోని 21 బంతుల్లో 36 పరుగులు వేగంగా ఆడి జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. డేవిడ్ మిల్లర్ 14 పరుగులతో అజేయంగా నిలిచాడు.
ఇక ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ విషయానికి వస్తే.. ముకేష్ కుమార్ ఈ మ్యాచ్‌లో స్టార్ బౌలర్‌గా నిలిచాడు. తన 4 ఓవర్లలో 33 పరుగులిచ్చి 4 కీలక వికెట్లు తీశాడు. స్టార్క్, చమేరా చెరో ఒక వికెట్ తీశారు. అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ వికెట్లు తీసేందుకు విఫలమయ్యారు.. కానీ, కంట్రోల్‌గా బౌలింగ్ చేశారు. చూడాలిమరి తక్కువ లక్ష్యాన్ని ఛేదిస్తుందో లేదో.