Love Suicide: ప్రేమ వేధింపులు తాళలేక బీఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య..
- పటాన్చెరువు సమీపంలోని గుమ్మడిదలలో ఒక అమ్మాయిని వేధింపులకు గురి చేయడంతో ఆత్మహత్య.
- ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన అమ్మాయిని ప్రేమించాలంటూ వెంటపడ్డాడు..
- పెళ్లి చేసుకుంటానని వేధించాడు..
- ప్రేమించకపోతే ఇంట్లో వాళ్ళని చంపేస్తాను.. అంటూ బెదిరించాడు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Love Suicide: ప్రతి ఒక్కరికి కూడా సోషల్ మీడియా అకౌంట్లో ఉంటున్నాయి.. సోషల్ మీడియా అకౌంటు లేకపోతే ఇప్పుడు అజ్ఞాని అంటారు.. అది మంచి జరుగుతుందో చెడు జరుగుతుందో తెలియదు.. కానీ కొంతమంది కిరాతకులు దానిని చెడుకోసమే వాడుతున్నారు.. ఇంస్టాగ్రామ్ లో అందమైన ఫోటోలు పోస్ట్ చేస్తున్నారు.. అంతేకాకుండా అమ్మాయిలకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడుతున్నారు.. రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేస్తే వాళ్ళని వేధింపులు గురిచేస్తున్నారు.. తాజాగా పటాన్చెరువు సమీపంలోని గుమ్మడిదలలో ఒక అమ్మాయిని వేధింపులకు గురి చేయడంతో ఆత్మహత్య చేసుకుంది..
Matrimony cheat: మ్యాట్రిమోని సైట్లలో తాను మోసపోయానని.. అందమైన యువతుల ప్రొఫైల్స్ పెట్టి.?
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన అమ్మాయిని ప్రేమించాలంటూ వెంటపడ్డాడు.. పెళ్లి చేసుకుంటానని వేధించాడు.. ప్రేమించకపోతే ఇంట్లో వాళ్ళని చంపేస్తాను.. అంటూ బెదిరించాడు బి ఫార్మసీ చదువుతున్న అమ్మాయి ఈ కిరాతకుడి వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడింది.. ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన వ్యక్తితో చాటింగ్ చేయడం ఫోటోలు షేర్ చేసుకోవడం వల్ల ఇబ్బందులు పడింది ..ఆ ఫోటోలు చాటింగ్ ను అడ్డం పెట్టుకొని తనను ప్రేమించాలని వెంటపడ్డాడు.. వేధించాడు చిత్రహింసల గురిచేశాడు.. ప్రేమించకపోతే మీ ఇంట్లో వాళ్లని చంపేస్తాను అంటూ బెదిరించాడు.. చివరికి భయంతో బీఫార్మసీ అమ్మాయి ఆత్మహత్యకు పాల్పడింది ..మరోవైపు అమ్మాయి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకున్న కిరాతకుడు తాను ఆత్మహత్యయత్నం చేశాడు ..కానీ చావలేదు.
Manchu Vishnu : కూతురు పుట్టినరోజు.. నటీనటులకు మంచు విష్ణు 10 లక్షల విరాళం
ప్రస్తుతానికి ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడు. ప్రేమ వేధింపులు తాళలేక బీఫార్మసీ విద్యా ర్థిని ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన పటాన్ చెరువు గుమ్మడి దల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. దోమడుగు గ్రామానికి చెందిన రాజు కూతురు తేజస్విని(20) నర్సాపూర్ సమీపంలోని న్యూ ప్రైవేట్ కళాశా లలో బీఫార్మసీ చదువుతోంది. అదే గ్రామానికి చెందిన గువ్వ శ్రీహరి ఐదు నెలల క్రితం ఇన్స్టాగ్రామ్ ద్వారా తేజస్వినికి పరిచయమయ్యాడు. అప్పటినుంచి ప్రేమిస్తు న్నానని, తనను పెళ్లి చేసుకోకపోతే మీ కుటుంబ సభ్యులను చంపేస్తానని యువతిని బెదిరించడం మొదలుపెట్టాడు. దీంతో మనస్తాపం చెందిన ఆ యువతి రాత్రి ఇంటి నాలుగో అంతస్తు పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. తీవ్రంగా గాయపడిన ఆమెను ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ తేజస్విని మృతి చెందింది.
New Rail Corridor: తూర్పు తీర ప్రాంతంలో కొత్త రైలు కారిడార్‌కు కేంద్రం గ్రీన్‌సిగ్నల్
పోలీసులు యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తేజస్విని తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు జిన్నారం సీఐ సుధీర్ కుమార్, గుమ్మడిదల ఎస్ఐ మహేశ్వర్ రెడ్డి తెలిపారు.. మరోవైపు యువతి చనిపోయిన విషయం తెలుసుకొని శ్రీహరి ఆత్మహత్యయత్నం చేశాడు. పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు .ప్రస్తుతానికి శ్రీహరి ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. యువతి ఆత్మహత్యకు కారణమైన శ్రీహరి పైన పోలీసులు కేసు నమోదుచేసి చర్యలకు రంగం సిద్ధం చేశారు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!