ఈ మధ్య మెట్రోలో డ్యాన్స్ లు ఎక్కువయ్యాయి.. మొన్నటివరకు ఢిల్లీ మెట్రో నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.. ఒక్క ఢిల్లీ మాత్రమే కాదు.. చాలా చోట్ల మనం మెట్రో డ్యాన్స్ లను చూస్తున్నాం.. ఆ వీడియోలు సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అవుతున్నాయో మనం చూస్తున్నాం.. తాజాగా మరో మెట్రో డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..
ఈ వీడియో నెటిజన్ల దృష్టిని ఎంతగానో ఆకర్షించింది. వారిలో ఎక్కువ మంది ఈ యువకుడి నమ్మకాన్ని అభినందిస్తూ వ్యాఖ్యానించారు. కాగా, ఈ సన్నివేశాన్ని లండన్‌లో చిత్రీకరించారు. మెట్రో రైలులో ఓ యువకుడు డ్యాన్స్ చేశాడు. ఈ యువకుడు బాలీవుడ్ ఎవర్‌గ్రీన్ సూపర్‌హిట్ పాట ఛైయ్యా చయ్యాకి స్టెప్పులేశాడు. మెట్రోలోని వివిధ ప్రాంతాలకు చెందిన డ్యాన్స్ క్లిప్‌లను కలిపి ఎడిట్ చేసిన వీడియో ఇప్పుడు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంది.. ఈ వైరల్ అవుతున్న వీడియోలో ఓ యువకుడు డ్యాన్స్ చేస్తున్నాడు..
చయ్యా చయ్యా పాట ప్లే అవుతుంది. ఈ పాట పాడుతుండగా, యువ నటి మలైకా అరోరాలా స్టెప్పులు వేయడం ప్రారంభించాడు.. అక్కడి ప్రయాణికులు కూడా అతడి డ్యాన్స్ పర్ఫామన్స్‌ను కుతూహలంగా ఎంజాయ్ చేస్తూ చూశారు. మెట్రో స్టేషన్, మెట్రో రైలు వంటి వివిధ ప్రదేశాలలో డ్యాన్స్ చేస్తూ వీడియోని క్యాప్చర్ చేశారు. ఈ వీడియో “చయ్య చయ్య: లండన్ ఎడిషన్” అనే ట్యాగ్ తో యాడ్ చేశారు..ఈ వీడియో సెప్టెంబర్ 7న షేర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. కాగా, ఇప్పుడు చాలా మంది ఈ వీడియోని వీక్షించి లైకులు, కామెంట్లు చేశారు. ఈ వీడియో చూసిన చాలా మంది యువకుడి టాలెంట్ ని మెచ్చుకుంటున్నారు.మొత్తానికి ఈ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తుంది.. ఓ లుక్ వేసుకోండి..