Minister Nara Lokesh: మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. విశాఖ, అమరావతి, తిరుపతి ఎకనమిక్ రీజియన్ అభివృద్ధి ప్రణాళికలతో వెళుతున్నట్లు తెలిపారు. వర్టికల్, హారిజాంటల్ అభివృద్ధి క్లస్టర్ విధానంలో కీలకం అని అన్నారు. ఉత్తరాంధ్రకు యూనివర్సిటీలు తీసుకురావాలని ముఖ్యమంత్రి ఆదేశించారని అన్నారు. ప్రభుత్వం నుంచి భూములు తీసుకున్న సంస్థలు బిల్డింగ్ ప్లాన్ వచ్చినప్పటి నుంచి 11 నెలల 29 రోజుల్లో కార్యకలాపాలు ప్రారంభించకపోతే భూములను వెనక్కి తీసుకుంటామని స్పష్టం చేశారు. READ ALSO: Off The Record:…
ఉండవల్లి లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ జరిగింది. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించే వ్యూహంపై ఎంపీలకు సీఎం దిశానిర్దేశం చేశారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టులపై చర్చించారు. 9 ప్రధాన అంశాలు అజెండాగా పార్లమెంటరీ పార్టీ సమావేశంలో చర్చ సాగింది. రద్దీ ప్రాంతాల నిర్వహణ, మహిళా నేతలపై అసభ్య ప్రచారంపై మాట్లాడారు. ఏరోస్పేస్ ఇండస్ట్రీ, స్పేస్ సిటీ, పోలవరం-బనకచర్ల, హంద్రీనీవాపై, రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులు, అమరావతిలో క్వాంటమ్ వ్యాలీపై చర్చించారు.