NTV Telugu Site icon

Lok Sabha Elections 2024: తెలంగాణలో మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ శాతం ఇలా..

Lok Sabha Elections 2024

Lok Sabha Elections 2024

Lok Sabha Elections 2024: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. రాష్ట్రంలో మూడు గంటల వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 52.34 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలతో పాటు సికింద్రాబాద్‌ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గంలో పోలింగ్ జరుగుతోంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. గత ఎన్నికల్లో కంటే ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో అధిక ఓటింగ్ శాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల అధికారి(సీఈవో) వికాస్ రాజ్‌ వెల్లడించారు. ఆదిలాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలో మధ్యాహ్నం 3.00 గంట వరకు పోలింగ్ 62.44 శాతం నమోదైనట్లు తెలిసింది.

 

Read Also:Patient On Stretcher Voted: స్ట్రెచర్‌ పై పోలింగ్ బూత్‌కి వెళ్లి మరీ ఓటు వేసిన మహిళ..

లోక్‌సభ నియోజక వర్గాల వారీగా పోలింగ్ శాతాలు ఇలా..
*ఆదిలాబాద్ -62.44 శాతం
*భువనగిరి -62.05 శాతం
*చేవెళ్ల -45.35 శాతం
*హైదరాబాద్‌ -29.47 శాతం
*కరీంనగర్-58.24 శాతం
*ఖమ్మం-63.67 శాతం
*మహబూబాబాద్-61.40 శాతం
*మహబూబ్నగర్-58.92 శాతం
*మల్కాజిగిరి-37.69 శాతం
*మెదక్-60.94 శాతం
*నాగర్ కర్నూల్ -57.17 శాతం
*నల్గొండ-59.91 శాతం
*నిజామాబాద్-58.70 శాతం
*పెద్దపల్లి-55.92 శాతం
*సికింద్రాబాద్-34.58 శాతం
*వరంగల్-54.17 శాతం
*జహీరాబాద్-63.96 శాతం

*సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం..39.92 శాతం ఓటింగ్ నమోదు.

Show comments