NTV Telugu Site icon

PM Modi: 14న మోడీ నామినేషన్.. హాజరుకానున్న ఎన్డీఏ సభ్యులు

Mid

Mid

ప్రధాని మోడీ మే 14న వారణాసిలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ నియోజకవర్గంలో చివరి విడతలో.. అనగా జూన్ 1న పోలింగ్ జరగనుంది. ఇందుకోసం మంగళవారం ప్రధాని నామినేషన్ వేయనున్నారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి ఎన్డీఏ కూటమిలోని పార్టీలకు బీజేపీ అధిష్టానం ఆహ్వానం పంపింది. ఏపీ నుంచి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వెళ్లనున్నారు. మంగళవారం ఉదయం వారణాసి చేరుకుని.. నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు.

ఇది కూడా చదవండి: Yogi Adityanath: “అతను ఎలాగైనా చావాల్సిందే”.. గ్యాంగ్‌స్టర్ అన్సారీ మరణంపై సీఎం యోగి కామెంట్స్..

మరోవైపు ప్రధాని మోడీ నామినేషన్ వేసేందుకు పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం భారీగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. ఈ ఏర్పాట్లను హోంశాఖ మంత్రి అమిత్‌షా, సీఎం యోగి ఆదిత్యనాథ్‌ పర్యవేక్షిస్తున్నారు. ఆ పార్టీ సీనియర్‌ నేత సునీల్‌ బన్సల్‌ చాలా రోజుల నుంచి అక్కడే ఉండి పనులను చక్కబెడుతున్నారు. నామినేషన్ అనంతరం ప్రధాని మోడీ అక్కడే రెండ్రోజులు ఉండి ప్రచారం నిర్వహించనున్నారు.

ఇది కూడా చదవండి: POK: పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో స్వేచ్ఛ కోసం పోరాటం.. భారీగా నిరసనలు..

ప్రధాన మోడీ గత కొద్దిరోజులుగా దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో ప్రచారం నిర్వహించారు. తీరిక లేకుండా అన్ని రాష్ట్రాలను చుట్టేస్తున్నారు. 400 సీట్లే లక్ష్యంగా ప్రధాని మోడీ ప్రచారం చేస్తున్నారు.

దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరుగుతోంది. ఇప్పటికేమూడు విడతల పోలింగ్ ముగిసింది. నాల్గో విడత సోమవారం జరగనుంది. అనంతరం మే 20, 25, జూన్ 1న జరగనుంది. జూన్ 4న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి.

ఇది కూడా చదవండి: Amit Shah: పాక్ వద్ద అణుబాంబులు ఉంటే పీఓకేని వదిలేయాలా..? కాంగ్రెస్ నేత వ్యాఖ్యలపై అమిత్ షా ఫైర్..