Karnataka: డిజిటల్ పేమెంట్లతో బీజేపీ గాలం వేసింది.. కాంగ్రెస్ ఆరోపణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటకలో డిజిటల్ పేమెంట్ వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది. మూడో దశ ఎన్నకల్లో భాగంగా ఓటర్లకు బీజేపీ ఫోన్ పే ద్వారా డబ్బులు పంచిందని కాంగ్రెస్ మంత్రి ప్రియాంక్ ఖర్గే తీవ్ర ఆరోపణలు చేశారు. మంగళవారం దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో మూడో దశ పోలింగ్ జరిగింది. చెదురుమదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది. అయితే బీజేపీ అక్రమాలకు పాల్పడిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. డిజిటల్ పేమెంట్లతో ఓటర్లకు డబ్బులు పంచినట్లు తమ దగ్గర ఆధారాలు ఉన్నాయిని ప్రియాంక్ ఖర్గే చెప్పారు. ఆధారాలతో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు. ఫోన్ పే ద్వారా పలువురికి డబ్బులు పంపించినట్లుగా తమ దగ్గర ఫ్రూప్స్ ఉన్నాయని తెలిపారు.
ఇది కూడా చదవండి: Murder: భార్య, కుమార్తెను చంపేసి ఆత్మహత్యాయత్నం చేసుకున్న భర్త.. విషమ పరిస్థితులలో కొడుకు..
Also Read
- Onion Price Hike: కన్నీరు పెట్టిస్తున్న ఉల్లి ధరలు.. కిలో రూ.70 వరకు విక్రయం!
- Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
- Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ..
- IND vs SL 2nd Test: క్లీన్ స్వీప్‌పై భారత్ కన్ను.. శ్రీలంకకు మళ్లీ గాయాల దెబ్బ..
సేడం, చిత్తాపూర్ నియోజకవర్గాలలో BJP నేరుగా PhonePeని ఉపయోగించి ఓటర్లకు లంచం ఇచ్చిందన్నారు. అటువంటి లావాదేవీలకు సంబంధించిన మరిన్ని ఆధారాలతో మేము ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు మంత్రి ట్వీట్ చేశారు. ఆన్లైన్లో ఓటర్లకు లంచాలు ఇస్తున్నట్లు గతేడాది నుంచి వార్తలు వస్తున్నాయి. దేశంలో ఒక రోజులో అధిక మొత్తంలో ఆన్లైన్ లావాదేవీలు జరుగుతున్నందున అధికారులకు ఇది సవాల్‌గా మారనుంది. ఇదిలా ఉంటే మూడో దశ ఎన్నికల్లో భాగంగా 61.45 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.
ఇది కూడా చదవండి: PM Modi: బీజేపీకి 400 సీట్లు ఎందుకు కావాలంటే..? వివరించిన పీఎం మోడీ..
దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరుగుతోంది. ఇప్పటికే మూడు విడతల పోలింగ్ ముగిసింది. నాల్గో విడత మే 13న జరగనుంది. అనంతరం మే 20, 25, జూన్ 1న జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం జూన్ 4న విడుదల కానున్నాయి.
తాజావార్తలు
-
Honor Turbo 5G: హానర్ టర్బో 5G విడుదల.. 8,560mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో కొత్త 5G ఫోన్
-
ToxicTheMovie : ‘టాక్సిక్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ప్రమాదం: సౌండ్ బాక్స్‌లు కూలి విద్యార్థులకు గాయాలు
-
Taapsee vs Kangana: ‘పెంపకం’ వ్యాఖ్యలతో మళ్లీ రాజుకున్న కంగనా-తాప్సీ వార్.. ఇన్‌స్టాలో ఫైర్ బ్రాండ్ కౌంటర్!
-
Onion Price Hike: కన్నీరు పెట్టిస్తున్న ఉల్లి ధరలు.. కిలో రూ.70 వరకు విక్రయం!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!