Onion Price Hike: కన్నీరు పెట్టిస్తున్న ఉల్లి ధరలు.. కిలో రూ.70 వరకు విక్రయం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Onion Price Hike: ఉల్లి ధరలు క్రమంగా పెరుగుతుండటంతో సామాన్య ప్రజలకు వంటింటి ఖర్చులు భారంగా మారుతున్నాయి. కాకినాడ రైతు బజార్లలో కిలో ఉల్లి ధర రూ.49కు చేరగా.. బయట మార్కెట్లలో మాత్రం కిలోకు రూ.60 నుంచి రూ.70 వరకు విక్రయిస్తున్నట్లు సమాచారం. కొన్ని చోట్ల కిలోకు రూ.80 కూడా అమ్ముతున్నారు. ఉల్లి ధరలు ఒక్కసారిగా పెరగడంతో.. వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మార్కెట్లలో ధరలను పర్యవేక్షించి.. అక్రమంగా అధిక ధరలకు విక్రయిస్తున్న వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
మహారాష్ట్ర నుంచి కాకినాడకు ఉల్లి సరఫరా తగ్గిపోవడంతో హోల్‌సేల్ ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. మరోవైపు కర్నూలు నుంచి కూడా మార్కెట్‌కు ఆశించిన స్థాయిలో ఉల్లి రావడం లేదని వ్యాపారులు పేర్కొంటున్నారు. సరఫరా తగ్గడం, డిమాండ్ కొనసాగడంతో ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయని అంటున్నారు. కాకినాడ గాంధీనగర్ రైతు బజార్లో నిర్దేశించిన ధరల కంటే ఎక్కువగా కొందరు వ్యాపారులు ఉల్లిని విక్రయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ధరలకు ఉల్లి కొనుగోలు చేయాలని భావించిన వినియోగదారులకు కూడా అదనపు ధరలు భారంగా మారుతున్నాయి.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
ఉల్లి ధరలు పెరుగుతుండటంపై వినియోగదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నిత్యావసరమైన ఉల్లిని కిలోకు రూ.60, రూ.70 చెల్లించి కొనుగోలు చేయడం కష్టంగా మారిందని వాపోతున్నారు. ధరలు ఇదే విధంగా కొనసాగితే.. మధ్యతరగతి, సామాన్య కుటుంబాలపై మరింత ఆర్థిక భారం పడుతుందని అంటున్నారు. ఉల్లి ధరలు పెరగడంతో హోటళ్లు, రెస్టారెంట్లపై కూడా ప్రభావం పడుతోంది. వంటల తయారీలో ఉల్లి వినియోగం ఎక్కువగా ఉండటంతో ముడిసరుకు ఖర్చు పెరిగిందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. దీంతో కొన్ని చోట్ల ఆహార పదార్థాల ధరలను కూడా పెంచారు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..