IND vs SL 2nd Test: క్లీన్ స్వీప్‌పై భారత్ కన్ను.. శ్రీలంకకు మళ్లీ గాయాల దెబ్బ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs SL 2nd Test Preview: భారత్, శ్రీలంక జట్ల మధ్య కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ (SSC) వేదికగా నేటి నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్ట్ మ్యాచ్‌పై అభిమానుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. గాళ్లలో జరిగిన తొలి టెస్టులో 165 పరుగుల భారీ విజయాన్ని నమోదు చేసిన టీమ్ ఇండియా, ఇప్పుడు అదే విజయ పరంపరను కొనసాగిస్తూ సిరీస్‌ను 2-0తో క్లీన్ స్వీప్ చేయాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు తొలి మ్యాచ్‌లో ఘోర పరాజయం పాలైన శ్రీలంకకు ఇబ్బందులు మరింత తీవ్రమయ్యాయి. జట్టులోని సీనియర్ బ్యాటర్లు దినేష్ చండిమాల్, కుసల్ మెండిస్ గాయాల కారణంగా సిరీస్ మొత్తానికి దూరం కాగా, ఫామ్‌లో ఉన్న పతుమ్ నిస్సంక కూడా అందుబాటులో లేడు. దీంతో సహాన్ అరచ్చిగే, కమిల్ మిషార వంటి యువ ఆటగాళ్లపై మిడిల్ ఆర్డర్ బాధ్యతలు పడ్డాయి.
తొలి టెస్టులో భారత్ విజయం సాధించినప్పటికీ, కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు లెఫ్టార్మ్ స్పిన్ ఎదుర్కొవడం పెద్ద సవాలుగా మారింది. గాళ్లలో ప్రభాత్ జయసూర్య బౌలింగ్‌లో అవుట్ అయిన గిల్, నెట్ ప్రాక్టీస్‌లో రవీంద్ర జడేజా, మానవ్ సుతార్‌లను ఎదుర్కొంటూ గంటల తరబడి శ్రమించాడు. దీంతో కొలంబోలో గిల్ బ్యాట్ నుంచి బిగ్ ఇన్నింగ్స్ వస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఇక తొలి టెస్టులో దేవ్‌దత్ పడిక్కల్ అద్భుత శతకం, స్పిన్నర్ మానవ్ సుతార్ 10 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. సాయి సుదర్శన్ అందుబాటులో లేకపోవడంతో పడిక్కల్‌కు జట్టులో స్థానాన్ని స్థిరపరుచుకోవడానికి ఇది మంచి అవకాశం కాగా, మానవ్ సుతార్ శ్రీలంక బ్యాటర్లకు మరోసారి గట్టి సవాలు విసరడానికి సిద్ధమయ్యాడు.
Also Read
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
టెస్టుల్లో భారత్, శ్రీలంక జట్ల రికార్డులను పరిశీలిస్తే టీమ్ ఇండియాది స్పష్టమైన ఆధిక్యం. ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు 47 టెస్టు మ్యాచ్‌లు జరగగా, భారత్ 23 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. శ్రీలంక కేవలం 7 మ్యాచ్‌ల్లో మాత్రమే గెలవగా, 17 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. ఇక, ఆగస్టు 23 నుంచి 27 వరకు జరిగే ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం ఉదయం 10:00 గంటలకు ప్రారంభమవుతుంది. టీవీలో ‘సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్’, ఉచితంగా ‘డీడీ స్పోర్ట్స్’ లలో ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఓటీటీ ప్రేక్షకులకు ‘సోనీ లివ్’ (Sony LIV) యాప్, వెబ్సైట్లో లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులో ఉంటుంది.
ఇరు జట్ల వివరాలు:
భారత్: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, దేవ్‌దత్ పడిక్కల్, కె.ఎల్. రాహుల్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, సారాంశ జైన్, ఆకిబ్ నబీ, మానవ్ సుతార్, గుర్నూర్ బ్రార్.
శ్రీలంక: ధనంజయ డిసిల్వా (కెప్టెన్), లాహిరు ఉదార, కమిల్ మిషార, పాసిందు సూర్యబండార, కమిందు మెండిస్, సహాన్ అరచ్చిగే, సోనాల్ దినుష, నిరోషన్ డిక్వెల్లా, కేశర నువాంత, ప్రభాత్ జయసూర్య, మిలాన్ రత్నాయకే, లాహిరు కుమార, అసిత్ ఫెర్నాండో, విశ్వ ఫెర్నాండో.
తాజావార్తలు
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
-
Electric Scooter Range Case: 85KM రేంజ్ అంటూ అమ్మారు.. వచ్చింది 16KM మాత్రమే! EV కంపెనీకి రూ.1.68 లక్షల షాక్
-
Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
-
Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!