‘మద్యం సేవించడం ఆరోగ్యానికి హానీ కరం’ అని ఎన్నిసార్లు చెప్పిన కొందరు మానుకునేందుకు ఇష్టపడరు. వాళ్లు మానుకుందాం అనుకున్నా ఆ వ్యసనం వారిని వదలదు. మొదట సరదాగా మొదలై.. అలవాటుగా మారుతుంది. చివరకు వ్యసనమై వేధిస్తుంది. శరీరాన్ని రోగాలపుట్టగా మారుస్తుంది. అయినప్పటికీ చాలా మంది మద్యపానాన్ని మానుకోలేరు. డైలీ తీసుకోవడానికి అలవాటుపడిపోతారు. ఎంత తీసుకుంటున్నామనే విషయంలో క్లారిటీ ఉండదు. నియంత్రణ లేకుండా ఎంతపడితే అంత తాగేస్తుంటారు. ఇలా ఆల్కహాల్ సేవించడం వల్ల బాడీలో మొదట దెబ్బతినే అవయం.. కాలేయం(Liver). అయితే రోజూ ఎంత మొత్తంలో మద్యం తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
Read more : Sajjala Ramakrishna Reddy: ఎగ్జిట్ పోల్స్ కంటే మెరుగైన ఫలితాలు వస్తాయి..!
ఏ రకం ఆల్కహాల్ అయినా.. ఎంత పరిమాణంలో తీసుకున్నా కాలేయానికి ప్రమాదకరమే అంటున్నారు నిపుణులు. కాబట్టి.. రోజుకు 30 ఎంఎల్ మించకుండా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కాలేయం దెబ్బతినే ప్రమాదాన్ని చాలా వరకు తగ్గించుకోవచ్చని చెబుతున్నారు. రోజుకు 80 ఎంఎల్ కంటే ఎక్కువ ఆల్కహాల్ తీసుకుంటే మాత్రం కచ్చితంగా కాలేయం దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు. 2018లో ‘British Medical Journal ఓపెన్’ అనే జర్నల్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. రోజుకు 30 గ్రాముల కంటే ఎక్కువ ఆల్కహాల్ తాగే వ్యక్తులకు కాలేయ వ్యాధి వచ్చే ప్రమాదం 2 రెట్లు ఎక్కువ అని కనుగొన్నారు. ఈ పరిశోధనలో నేషనల్ తైవాన్ యూనివర్సిటీ ఆసుపత్రికి చెందిన ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ గాయ్-యూన్ లిన్ పాల్గొన్నారు.
మందు తాగగానే అది కడుపు, చిన్నపేగుల ద్వారా రక్తంలో కలుస్తుంది. ఖాళీ కడుపుతో కనక తాగినట్లయితే అది కొద్ది నిమిషాల్లోనే రక్తంలో కలిసిపోతుంది. కాబట్టి.. ఖాళీ కడుపుతో అస్సలే తాగకూడదు. తాగుతున్నప్పుడు మంచి ఆహారం తీసుకుంటే.. మద్యం రక్తంలో కలిసే ప్రక్రియ కాస్త నెమ్మదిగా జరుగుతుందంటున్నారు. లివర్‌లో చేరిన ఆల్కహాల్‌తో అక్కడి ఎంజైమ్స్ చర్య జరిపి దాన్ని ఎసెటాల్‌డిహైడ్‌గా మారుస్తాయట. ఇది పెద్దమొత్తంలో ఉంటే విషంతో సమానమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.