Livein relationship: ప్రస్తుత ప్రపంచంలో పెళ్లి అనే పదానికి అర్థం మార్చేస్తున్నారు. చాలామంది పెళ్లి చేసుకోకుండా లివింగ్ రిలేషన్షిప్ అంటూ పాశ్చాత్య దేశాల సంస్కృతిని అవలంభించుకుంటున్నారు. ఇకపోతే తనని పెళ్లి చేసుకుంటానని మోసం చేయడమే కాకుండా.. పలుమార్లు అత్యాచారం చేశాడంటూ ఓ వ్యక్తిపై మహిళా కేసు పెట్టింది. అయితే ఇలాంటి విషయాల్లో ముందుగానే అరెస్టు నుంచి తప్పించుకోవడానికి అతడు ఇదివరకే ఓ మాస్టర్ ప్లాన్ వేసి ఉంచాడు. అతడు అరెస్టు నుంచి తప్పించుకోవడానికి లాయర్ ని సంప్రదించి., ఆ మహిళతో సహజీవనం చేసేందుకు తమ మధ్య ఉన్న ఒప్పందాన్ని బయట పెట్టాడు. ఇక వారి మధ్య చేసుకున్న ఒప్పందం నేపథ్యంలో తనపై ఎటువంటి కేసు చెల్లదని అతడు చెప్పడం గమనార్హం. అయితే ఆ మహిళ మాత్రం ఆ డాక్యుమెంట్ పై సంతకం చేసింది తాను కాదని వాదిస్తుండడంతో ఈ కేసు విషయంలో నిజాలను తేల్చేందుకు పోలీసులు పనిలో పడ్డారు.
Medaram Forest: మేడారం అడవుల్లో సుడిగాలుల బీభత్సం.. 50 వేలకు పైగా చెట్లు నేలమట్టం..
ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే.. ముంబై నగరానికి చెందిన 29 ఏళ్ల యువతి వృద్ధుల సంరక్షకురాలిగా పనిచేస్తుంది. అయితే 46 ఏళ్ల ప్రభుత్వ ఉద్యోగిగ పనిచేస్తున్న వ్యక్తి గత కొద్ది కాలంగా ఆ మహిళతో సహజీవనం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ మహిళను అతను పెళ్లి చేసుకుంటాడని మోసం చేసి పలుమార్లు అత్యాచారం చేశాడంటూ కేసు పెట్టింది. దీంతో అతడు అగ్రిమెంట్ ను బయటకి తీయడమే కాకుండా లాయర్ ను పెట్టుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే వారిద్దరు ఇష్టపూర్వకంగా అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు కాబట్టి దీన్ని మోసపూరిత కేసుగా లాయర్ కోర్టులో వాదించడంతో సంతకం తనది కాదని యువతి తెలిపింది. ఇకపోతే వారిద్దరూ కుదుర్చుకున్న ఒప్పందంలో మొత్తం ఏడు పాయింట్లు ఉన్నాయి. అవేంటంటే.
Jackfruit: పోషకాహార లోపాల సమస్యలకు పనస పండుతో చెక్..
* ఏడాదిపాటు కలిసుండాలని నిర్ణయం తీసుకున్నారు.
* కలిసినప్పుడు పరస్పరం ఎవరు లైంగిక వేధింపు కేసులు చేయకూడదు.
* సహజీవన సమయంలో మహిళ అతని ఇంట్లో ఉంటుందని పేర్కొన్నారు.
* ఒకవేళ సహజీవంలో ఎవరైనా అవతల వ్యక్తి నచ్చకపోతే నెలరోజులు ముందే నోటీస్ పీరియడ్ ఇవ్వాలి.
* ఒకవేళ సహజీవన సమయంలో మహిళ గర్భం దాల్చిన అతడు బాధ్యుడు కాదని మరో పాయింట్.
* అలాగే సహజీవన సమయంలో ఇద్దరి బంధువుల రాకపోకలపై ఆంక్షలు.
* మానసిక ప్రశాంతత భంగం వాటిల్లకుండా ఉండేలా మరికొన్ని పాయింట్లు అగ్రిమెంట్లు చేర్చారు.
ఈ పాయింట్లన్నీ ఓ అగ్రిమెంటులో రాయించుకొని దానిని నోటరీ చేయించడం ఇప్పుడు చర్చనీయాంశం గా మారింది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.