Liquor Scam: లిక్కర్ కేసులో అవినాష్ రెడ్డికి రిమాండ్.. రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Liquor Scam: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన లిక్కర్ కుంభకోణం కేసులో నిందితుడిగా ఉన్న ముప్పిడి అవినాష్ రెడ్డికు ACB కోర్టు విజయవాడ రేపటిదాకా రిమాండ్ విధించింది. ఈ కేసులో A7 నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డిని గుంటూరు జిల్లా జైలుకు తరలించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇతర నిందితుల రిమాండ్ గడువు కూడా ముగియనున్న నేపథ్యంలో అందరినీ కలిపి రేపు మళ్లీ కోర్టులో హాజరు పరచనున్నారు.
IND vs ZIM: మ్యాచ్ కు వేళాయె.. రెండు మార్పులతో బరిలోకి భారత్.. సంజూ ఆన్ డ్యూటీ!
Also Read
- Rajamahendravaram: గోదావరిలో హౌస్‌బోట్.. రాజమహేంద్రవరంలో పర్యాటకానికి ఫుల్ జోష్!
- Tirupati: శేషాచలం అడవుల్లో రెండుగా విడిపోయిన ఏనుగుల గుంపు.. అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక!
- Road Accident: రాజమండ్రిలో రోడ్డు ప్రమాదం.. స్కూల్ బస్సు-ఆటో ఢీ..
- ACB Raid: భూమి మ్యుటేషన్ కోసం లంచం అవతారం.. ఏసీబీ వలలో వీఆర్వో..
లిక్కర్ స్కాం కేసులో భాగంగా అవినాష్ రెడ్డిని ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) అధికారులు విజయవాడలోని కార్యాలయంలో సుమారు ఐదు గంటల పాటు విచారించారు. విచారణ అనంతరం వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, తరువాత కోర్టులో హాజరు పరిచారు. ముందస్తు బెయిల్ కోసం ఆంధ్రప్రదేశ్ హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టును ఆశ్రయించినా, రెండు చోట్లా పిటిషన్లు తిరస్కరించబడటంతో అవినాష్ రెడ్డి సిట్ అధికారుల ఎదుట లొంగిపోయారు.
రిమాండ్ రిపోర్ట్ ప్రకారం.. ఈ లిక్కర్ కుంభకోణంలో అవినాష్ రెడ్డి కీలక పాత్ర పోషించినట్లు అధికారులు వెల్లడించారు. ప్రధాన నిందితుడు A1 కేసిరెడ్డితో కలిసి కోట్ల రూపాయల ఆర్థిక లావాదేవీలు నిర్వహించినట్లు గుర్తించారు. మద్యం సిండికేట్‌ను ఏర్పాటు చేసి, కిక్‌బ్యాక్‌లు, కమీషన్ల ద్వారా అక్రమంగా భారీ ఆర్థిక లాభాలు పొందినట్లు రిపోర్ట్‌లో పేర్కొన్నారు. మద్యం సిండికేట్ కార్యకలాపాల్లో అవినాష్ రెడ్డి ప్రధాన వ్యూహకర్తగా, ఆర్థిక నియంత్రణ దారుడిగా వ్యవహరించినట్లు సిట్ అధికారులు తెలిపారు.
SA vs WI: మార్క్రమ్ మెరుపులు.. డీకాక్ దూకుడు! విండిస్ పై సౌతాఫ్రికా భారీ విజయం!
పాత బ్రాండ్లను మార్కెట్ నుంచి తొలగించి, తమకు అనుకూలంగా కమిషన్లు ఇచ్చే బ్రాండ్లను మాత్రమే కొనుగోలు చేసేలా నిర్ణయాలు తీసుకున్నట్లు విచారణలో తేలింది. అక్రమంగా సంపాదించిన డబ్బును వ్యక్తిగత ఖర్చులతో పాటు ఆస్తుల కొనుగోలుకు వినియోగించినట్లు కూడా రిమాండ్ రిపోర్ట్‌లో వెల్లడించారు. ఈ కేసులో ఇప్పటికే పలువురు కీలక నిందితులను అరెస్ట్ చేసిన అధికారులు, ఇంకా విచారణ కొనసాగిస్తున్నారు. అవినాష్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని సమాచారం. రేపు కోర్టులో మరోసారి హాజరు పరచనున్న నేపథ్యంలో ఈ కేసులో మరిన్ని కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశముంది.
తాజావార్తలు
-
Skincare Tips: బ్యూటీ పార్లర్‌కు బై బై చెప్పండి!.. ఇంట్లోనే సహజంగా ముఖానికి మెరుపు తెచ్చే 3 టిప్స్ ఇవే..
-
Spy Action Thriller: థియేటర్లలో పట్టించుకోలేదు.. ఓటీటీలో నంబర్ 1 ట్రెండింగ్ లో స్పై యాక్షన్ థ్రిల్లర్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Nepal Floods: “నువ్వు దేవుడు సామీ”.. వరదల్లో 1,643 మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడిన ప్రిన్సిపాల్
-
Suryakumar Yadav: తప్పంతా నాదే.. వన్డే కెరీర్‌పై సూర్యకుమార్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!