Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Lemon Prices Surge To Rs 130 Per Kg In Eluru Market Amid Low Yield

Lemon Prices: అమాంతం పెరిగిన నిమ్మకాయల ధరలు.. రూ.30 నుంచి రూ.130కి..!

Published Date :April 11, 2026 , 2:04 pm
By Sudhakar Ravula
Lemon Prices: అమాంతం పెరిగిన నిమ్మకాయల ధరలు.. రూ.30 నుంచి రూ.130కి..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Lemon Prices: వేసవి సీజన్ ప్రారంభం కావడంతో నిమ్మకాయల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఇటీవల వరకు కిలో రూ.30 దాటని నిమ్మకాయలు, ఇప్పుడు మార్కెట్‌లో ఏకంగా రూ.120 నుంచి రూ.130 వరకు పలుకుతున్నాయి. ధరలు భారీగా పెరగడంతో వినియోగదారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుండగా, రైతులు మాత్రం దిగుబడి లేక ఆవేదన చెందుతున్నారు. ఏలూరు నిమ్మకాయల యార్డులో ప్రస్తుతం కిలో నిమ్మకాయలు రూ.120 నుంచి రూ.130 వరకు అమ్ముడవుతున్నాయి. గత రెండు మూడు రోజులుగా రేట్లు ఒక్కసారిగా పెరగడంతో వ్యాపారులు, కొనుగోలుదారులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

వేసవి కారణంగా పెరిగిన డిమాండ్
వేసవి కాలంలో నిమ్మకాయలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. శీతల పానీయాలు, నిమ్మరసం, గృహ వినియోగం కోసం ఎక్కువగా కొనుగోలు చేస్తారు. దీంతో సహజంగానే మార్కెట్‌లో డిమాండ్ పెరిగింది. అయితే, సరఫరా తగ్గిపోవడంతో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.

దిగుబడి లేక రైతుల ఆవేదన
ధరలు పెరిగినా రైతులు ఆనందంగా లేరు. కారణం, ఈసారి నిమ్మకాయల దిగుబడి తీవ్రంగా తగ్గిపోయింది. తెగుళ్ల ప్రభావం, వాతావరణ మార్పులు కారణంగా పంట నష్టపోయిందని.. సరైన దిగుబడి రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు.. గతంలో ఎకరాకు 40 బస్తాల వరకు దిగుబడి వచ్చేదని, ప్రస్తుతం 15 బస్తాలు కూడా రావడం లేదని వారు వాపోతున్నారు. ధరలు పెరిగినా అమ్మడానికి సరిపడా ఉత్పత్తి లేకపోవడంతో లాభం లేదని అంటున్నారు. అయితే, నిమ్మకాయల ధరలు పెరగడంతో సామాన్య ప్రజలపై అదనపు భారం పడుతోంది. ఒక్కో నిమ్మకాయ ధర కూడా పెరగడంతో రోజువారీ వినియోగంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh agriculture news
  • Eluru lemon market
  • fruit market prices
  • lemon farmers news
  • lemon price hike India

తాజావార్తలు

  • Lemon Prices: అమాంతం పెరిగిన నిమ్మకాయల ధరలు.. రూ.30 నుంచి రూ.130కి..!

  • The Paradise: ‘ద ప్యారడైజ్’ నుండి ‘సుబ్బు’ వచ్చేసింది.. నాని హీరోయిన్ ఫస్ట్ లుక్ అదిరిపోయిందిగా!

  • Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఓటీటీ రిలీజ్ డేట్ల ఫిక్స్.. ఏకంగా ఐదు భాషల్లో స్ట్రీమింగ్!

  • US-Iran Peace Talks: లెబనాన్‌పై దాడులు ఆపితేనే చర్చలు.. ఇరాన్ పంతం.. చర్చలపై ప్రతిష్టంభన

  • Rilee Rossouw: “ఐపీఎల్ ఒక సినిమా డ్రామా”.. IPL కంటే PSL గ్రేట్ అంటూ రోసో పిచ్చి కూతలు..

ట్రెండింగ్‌

  • సరికొత్త కలర్స్, అబ్బురపరిచే డిజైన్, 200MP కెమెరాతో మార్కెట్ ను షేక్ చేయడానికి సిద్దమైన Huawei Pura 90 సిరీస్..!

  • Pillow Cover Stains : నూనె మరకలతో దిండ్లు చెడిపోయాయా.? ఇలా చేస్తే కొత్తలాగే మెరుస్తాయి.!

  • Ragi Bread : ఈస్ట్ అక్కర్లేదు.. గ్లూటెన్ భయం లేదు.. ఆరోగ్యకరమైన ‘రాగి బ్రెడ్’ ఇప్పుడు ఇంట్లోనే.!

  • రికార్డు సృష్టించిన MG Majestor.. రైలును లాగి గిన్నిస్ బుక్‌లో స్థానం!

  • Car Prices Hike: కారు కొనాలనుకుంటే కోనేయండమ్మా.. మే 1 నుండి మరింత కాస్ట్లీ కాబోతున్నాయి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions