సరికొత్త కలర్స్, అబ్బురపరిచే డిజైన్, 200MP కెమెరాతో మార్కెట్ ను షేక్ చేయడానికి సిద్దమైన Huawei Pura 90 సిరీస్..!
- Huawei Pura 90 Series అధికారికంగా ప్రకటింపు
- ఏప్రిల్ 20న చైనాలో లాంచ్ (Pro, Pro Max మోడల్స్)
- Huawei సోషల్ మీడియా ద్వారా వివరాలు వెల్లడి
- ప్రీ-బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభం
- గ్రాడియెంట్ ఫినిష్‌తో కొత్త బోల్డ్ డిజైన్
- క్లాసిక్ బ్లాక్, వైట్ కలర్ ఆప్షన్స్ కూడా అందుబాటులో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Huawei Pura 90 Series: ప్రముఖ టెక్ దిగ్గజం హువాయ్ (Huawei) సంస్థ నుండి స్మార్ట్‌ఫోన్ సిరీస్ అయిన Pura 90 లాంచ్‌ను అధికారికంగా ప్రకటించింది. కంపెనీ సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా వెల్లడించిన సమాచారం ప్రకారం Huawei Pura 90 Pro, Huawei Pura 90 Pro Max మోడల్స్ ఏప్రిల్ 20న చైనాలో విడుదల కానున్నాయి. ఇప్పటికే ఈ రెండు ఫోన్లకు ప్రీ-బుకింగ్స్ కూడా మొదలయ్యాయి.
Avakaya Pulihora Recipe: పుల్లపుల్లగా.. కారంకారంగా.. అదిరిపోయే రుచితో ‘ఆవకాయ పులిహోర’ చేసేయండి ఇలా.!
Also Read
- Starlink India Row: ‘మార్కెట్ గుత్తాధిపత్యం కోసమే అడ్డుకుంటున్నారు’.. Starlink Indiaపై ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు
- Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
- IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
- Flipkart BBD: 6000 mAh బ్యాటరీ.. ఏఐ+ బ్రాండ్‌లో 5 స్మార్ట్ ఫోన్స్.. భారీ డిస్కౌంట్లు..
లాంచ్‌కు ముందే కంపెనీ ఈ ఫోన్ల డిజైన్‌ను కూడా విడుదల చేసింది. కొత్త Pura 90 సిరీస్‌లో గ్రాడియెంట్ ఫినిష్‌తో బోల్డ్ లుక్ ఇవ్వనున్నారు. రంగులపై ఆసక్తి లేని వినియోగదారుల కోసం క్లాసిక్ బ్లాక్, వైట్ కలర్ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉంటాయి. గతంలో P20, P30 సిరీస్‌లలో గ్రాడియెంట్ డిజైన్‌ను ఉపయోగించిన కంపెనీ, ఇప్పుడు అదే ట్రెండ్‌ను మరింత మోడర్న్ టచ్‌తో తీసుక వస్తుంది.
డిజైన్ పరంగా చూస్తే ఈ ఫోన్ల వెనుక భాగంలో రౌండెడ్ ట్రయాంగిల్ ఆకారంలో కెమెరా మాడ్యూల్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఫ్లాట్ ఎడ్జెస్‌తో ఫోన్‌కు మరింత స్టైలిష్, ప్రీమియం లుక్ ఇచ్చారు. ఈ ‘ప్రో’ మోడల్స్ రెండింటిలో కూడా ఇదే డిజైన్ కొనసాగనుంది. హార్డ్‌వేర్ విషయానికి వస్తే ఈ స్మార్ట్‌ఫోన్లు Kirin 9030 లేదా Kirin 9030 Pro చిప్‌సెట్‌తో రానున్నాయని సమాచారం. అలాగే ఇవి HarmonyOS 6.1 పై పనిచేసే అవకాశం ఉంది. Huawei కొత్తగా HyperSpace Memory టెక్నాలజీని కూడా ఈ సిరీస్‌లో ప్రవేశపెట్టనుంది. ఈ టెక్నాలజీ ద్వారా 16GB RAM ఉన్న ఫోన్ కూడా 20GB RAM పనితీరును అందించగలదని చెబుతున్నారు.
Pakistan: పాక్‌లో అంతా రివర్స్.. రక్షణ మంత్రిని మందలించిన ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్..
కెమెరా విషయానికి వస్తే, Huawei Pura 90 సిరీస్‌లో రెండో తరం ‘మాపిల్ ఇమేజింగ్ సిస్టం’ ఇవ్వనున్నారు. అలాగే 200MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ కూడా ఉండే అవకాశం ఉంది. దీని ద్వారా లాంగ్-రేంజ్ ఫోటోగ్రఫీ మరింత మెరుగవుతుంది. రాబోయే Huawei Pura 90 Pro సిరీస్ కొత్త డిజైన్, శక్తివంతమైన ఫీచర్లు, అడ్వాన్స్‌డ్ కెమెరాతో మార్కెట్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది. లాంచ్‌కు ముందు మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Age Gap Stories : ఏజ్ గ్యాప్ లవ్‌స్టోరీలకు కేరాఫ్ అడ్రస్‌గా యంగ్ హీరో.. ఏకంగా నాలుగు హిట్స్
-
Nana Patekar: “రియల్ హీరో”.. సైనికులతో కలిసి కార్గిల్‌లో 60 రోజులు యుద్ధం చేసిన నానా పటేకర్..
-
Kieron Pollard: ముంబై ఇండియన్స్‌కు షాక్.. ప్రత్యర్థి జట్టులోకి కీరన్ పొలార్డ్!
-
Nara Lokesh: డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం సమిష్టిగా ముందుకు..
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
ట్రెండింగ్
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!