S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
- లెజెండరీ గాయని ఎస్. జానకి కన్నుమూత.
- బాల్యంలో సిరిసిల్లలో నివసించిన జానకికి తెలంగాణతో ప్రత్యేక అనుబంధం.
- రెండెడ్ల బండిపై వేములవాడ వెళ్లి 'బాలనాగమ్మ' సినిమా చూసిన జ్ఞాపకాలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
S Janaki: లెజెండరీ సింగర్ ఎస్. జానకి కన్నమూశారు. భారత సినీ సంగీత ప్రపంచంలో చెరగని ముద్ర వేసిన జానకమ్మ, శనివారం మైసూరులో చికిత్స పొందుతూ మరణించారు. 1938 ఏప్రిల్ 23న గుంటూరు జిల్లా రేపల్లె తాలూకాలోని పల్లపట్ల గ్రామంలో శ్రీరామమూర్తి, సత్యవతి దంపతులకు జన్మించిన జానకికి తెలంగాణతో అవినాభావ సంబంధం ఉంది. ఆమె ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్లలో కొంత కాలం నివసించారు. వేములవాడతో విడదీయరాని సంబంధం ఏర్పడింది.
జానకి తండ్రి ఉపాధ్యాయుడిగా, ఆయుర్వేద వైద్యుడిగా సేవలందించారు. ఆ సమయంలో ఆయన ఉద్యోగరీత్యా సిరిసిల్లకు రావడంతో తెలంగాణ ప్రాంతంతో కూడా ఆమెకు మంచి సంబంధం ఏర్పడింది. ఒక ఇంటర్వ్యూలో జానకి ఈ విషయాన్ని స్వయంగా చెప్పారు. కరీంనగర్ జిల్లాలో సిరిసిల్లలో ఉండేవాళ్లమని, మూడు నాలుగేళ్ల వయసులో ‘‘బాలనాగమ్మ’’ సినిమా చూడటానికి వేములవాడ వెళ్లానని చెప్పారు. రెండెడ్ల బండిలో వేములవాడకు వెళ్లేవారమని చిన్ననాటి విషయాలను గుర్తుచేసుకున్నారు. తాను పాటలు పాడటాన్ని చూసి, పక్కింటి వాళ్లు తీసుకెళ్లేవారని, పాట పాడమని అడిగేవారని చెప్పారు.
Also Read
- S Janaki: పెళ్లి.. పిల్లలు.. వేల పాటలు.. ఎస్.జానకి జీవితంలో తెలియని విశేషాలు!
- S Janaki: మన తెలుగు గర్వం ఎస్. జానకి.. గుంటూరు నుంచి భారత సంగీత గగనానికి ఎదిగిన గానకోకిల
- Nagarjuna: కొడుకు సక్సెస్ కోసం నాగార్జున తపన.. ‘లెనిన్’ స్క్రిప్ట్‌లో కింగ్ రైటింగ్!
- Akkineni Nagarjuna : అఖిల్‌కి హిట్ ఇవ్వమని శ్రీ వెంకటేశ్వర స్వామిని కోరుకున్నాను
19 ఏళ్ల వయసులో తన మామయ్య సూచన మేరకు చెన్నై చేరుకున్న జానకి, ప్రముఖ ఏవీఎం (AVM) స్టూడియోలో గాన ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆ అవకాశమే ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. అనంతరం చెన్నైని కేంద్రంగా చేసుకుని వేలాది పాటలు ఆలపిస్తూ దక్షిణ భారతంతో పాటు దేశవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన గాయనిగా ఎదిగారు. 1957లో తమిళ సినిమాతో ప్లేబ్యాక్ సింగర్‌గా ఎంట్రీ ఇచ్చిన జానకమ్మ విధియిన్ విలయాట్టు సినిమాలో పాట పాడారు. 60 ఏళ్ల కెరీర్లో 17 భాషల్లో 48 వేలకు పైగా పాటలు పాడారు.
https://t.co/MNRKAnCDuc#Sjanaki #BreakingNews #sircilla #Vemulawada
— Krishna Gogikar (Journalist) (@Krishna614) July 11, 2026
తాజావార్తలు
-
OTR : యాదాద్రి ఆలయ పాలకమండలి ప్రమాణ స్వీకారం.. మంత్రుల డుమ్మా!
-
Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
-
Harish Rao : షాబాద్ ఆరుగురి హత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే
-
S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
-
Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్‌పై తీవ్ర విమర్శలు
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్‌లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్‌తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!