Asha Bhosle : మూగబోయిన గాన గంధర్వం.. లెజెండరీ గాయని ఆశా భోస్లే కన్నుమూత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయ సంగీత శిఖరం, వేలాది మధుర గీతాలతో కోట్లాది మందిని అలరించిన పద్మవిభూషణ్ ఆశా భోస్లే (92) ఇక లేరు. గత కొద్దిరోజులుగా తీవ్రమైన ఛాతీ ఇన్ఫెక్షన్, శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమె, ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నేడు తుదిశ్వాస విడిచారు. ఆమె మరణవార్త తెలియగానే యావత్ సినీ ప్రపంచం దిగ్భ్రాంతికి గురైంది. సంగీత ప్రియులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.
లెజెండరీ గాయని లతా మంగేష్కర్ సోదరిగా సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఆశా భోస్లే, ప్రారంభంలో తనకంటూ గుర్తింపు తెచ్చుకోవడానికి ఎంతో శ్రమించారు. 1943లో ‘మాఝా బాళ్’ అనే మరాఠీ సినిమాతో మొదలైన ఆమె ప్రస్థానం, 1950వ దశకంలో బాలీవుడ్ వైపు మళ్లింది. 1952లో వచ్చిన ‘సంగ్దిల్’ సినిమాతో ఆమె గొంతు దేశవ్యాప్తంగా వినబడటం మొదలైంది. ‘పరిణీత’, ‘బూట్ పాలిష్’ వంటి చిత్రాలు ఆమెను అగ్ర దర్శకుల దృష్టిలో పడేలా చేశాయి. ముఖ్యంగా సంగీత దర్శకుడు ఆర్.డి. బర్మన్తో ఆమె చేసిన ప్రయోగాలు ఒక ట్రెండ్‌ను సెట్ చేశాయి. “ఆజా ఆజా,” “పియా తూ అబ్ తో ఆజా,” “యే మేరా దిల్” వంటి వెస్ట్రన్ టచ్ ఉన్న పాటలతో ఆమె అప్పట్లోనే సంచలనం సృష్టించారు.
Also Read
- Story Board: హైదరాబాద్‌లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
- RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
- Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్‌కు ట్రంప్ తాజా హెచ్చరిక
కేవలం మెలోడీలే కాకుండా, క్యాబరే సాంగ్స్, క్లబ్ డ్యాన్స్ నంబర్లను సైతం అంత హుందాగా పాడటం ఆమెకే సాధ్యమైంది. మొహమ్మద్ రఫీతో కలిసి ఆమె పాడిన “మాంగ్ కే సాథ్ తుమ్హారా,” “సాథీ హాత్ బధానా” వంటి పాటలు నేటికీ ఎవర్ గ్రీన్ హిట్స్‌గా నిలిచిపోయాయి. ఇక ఆశా భోస్లేకి తెలుగు భాషతో విడదీయలేని అనుబంధం ఉంది. ‘మాయాబజార్’ వంటి క్లాసిక్ సినిమాల నుంచి మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ సినిమాల వరకు ఆమె ఎన్నో సూపర్ హిట్ పాటలు పాడారు. “వస్తాడు నా రాజు..” వంటి మధుర గీతాలు నేటికీ శ్రోతల చెవుల్లో మారుమోగుతూనే ఉన్నాయి. ఆమె ప్రతిభకు గుర్తింపుగా భారత ప్రభుత్వం పద్మవిభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులతో సత్కరించింది.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్‌లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్‌కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్‌లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!