Lavanya: ప్రస్తుతం టాలీవుడ్ యంగ్‌హీరో రాజ్‌తరుణ్-లావణ్య వ్యవహారంపై జోరుగా చర్చ జరుగుతోంది. ఎన్టీవీకి ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో లావణ్య కీలక విషయాలను వెల్లడించింది. అరియానా గ్లోరీకి రాజ్‌తరుణ్‌తో ఎఫైర్ ఉందని లావణ్య సంచలన వ్యాఖ్యలు చేసింది. ఎఫైర్ ఉందని ఎలా తెలుసుకున్నారనే ప్రశ్నకు కూడా ఆమె సమాధానమిస్తూ.. ఒక అమ్మాయి ఎలా ఉంటుందనే విషయం సాధారణంగా ఒక అమ్మాయిగా తనకు తెలుస్తుందని.. కానీ అరియానా దానికి మించి రాజ్‌తరుణ్ తన బాయ్‌ఫ్రెండ్‌లా భావించిందని లావణ్య పేర్కొంది. అరియానా-రాజ్‌తరుణ్‌లు ఎన్నో ఫొటోలు దిగారని,చాటింగ్ చేసుకున్నారని చెప్పింది.
Read Also: Lavanya Parents Interview: అల్లుడు తిరిగొస్తే చాలు.. కన్నీళ్లు పెట్టుకున్న లావణ్య పేరెంట్స్
అరియానా ఇంటికి రాజ్‌తరుణ్ వెళ్లే వాడని.. ఆమెతో ఉండే కామెడీ నటులే తనకు ఫోన్ చేసి చెప్పారని లావణ్య తెలిపింది. అరియానా ఉన్న అపార్ట్‌మెంట్‌లో వాళ్లు కూడా తనకు ఫోన్ చేసి, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా చెప్పారని లావణ్య ఈ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఇన్‌స్టాలో ఫోటోలు చూసిన అనంతరం అరియానాను కూడా నిలదీశానని తెలిపింది. తాను గోవాలో ఉండగా అరియానా రాజ్‌తరుణ్ ఫోన్ నుంచి కాల్ చేసిందని లావణ్య చెప్పుకొచ్చింది. నీకు జీతం ఎంత వస్తుందని అడిగిందని.. నాకు ఇప్పుడు రోజుకు 50 వేల నుంచి లక్ష వరకు వస్తుందని అరియానా ఫోన్లోనే అగౌరపరిచేలా మాట్లాడిందని లావణ్య పేర్కొన్నారు. తనను ఎదుర్కొనేందుకే రాజ్‌తరుణ్ అరియానాను ఎంచుకున్నట్లు తెలుస్తోందని లావణ్య తెలిపింది. తర్వాత అరియానా ఫోన్ చేసి సారీ చెప్పిందని.. ఆ ఆడియో కూడా ఉందని.. ప్రస్తుతం అరియానాతో ఇప్పుడు ఏం సమస్య లేదని ఆమె స్పష్టం చేసింది.