Priyanka Gandhi: మిషన్ మధ్యప్రదేశ్ ప్రారంభం. ప్రచారంలో పాల్గొన్న ప్రియాంకా గాంధీ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Priyanka Gandhi: కర్నాటక, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో విజయం తర్వాత కాంగ్రెస్ జోరు మీదుంది. ఇవాళ మిషన్ మధ్యప్రదేశ్ ను ప్రియాంక గాంధీ ప్రారంభించారు. అంతకుముందు మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు కమల్నాథ్, పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ జేపీ అగర్వాల్, రాజ్యసభ ఎంపీ వివేక్ తంఖాతో కలిసి గ్వారిఘాట్లో నర్మదా నది ఒడ్డున ప్రియాంక పూజలు చేశారు. అక్కడ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రియాంకా.. బీజేపీని గద్దె దించేందుకు హస్తం పార్టీ అస్త్రాలను సిద్ధం చేసుకుంటుంది. మత రాజకీయాలకు మధ్యప్రదేశ్ అడ్డాగా మారిందని.. మతకలహాలు సృష్టించి బీజేపీ ఎన్నికల్లో విజయం సాధిస్తోందని ప్రియాంకా గాంధీ ఆరోపించారు.
Read Also : Nikhil ‘Spy’ release: నిఖిల్ ‘స్పై’ రిలీజ్ డేటుపై భేదాభిప్రాయాలు..చెప్పిన డేటుకు డౌటే?
Also Read
- How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
- CM Chandrababu: నియోజకవర్గాల స్థాయిలో విజన్ ప్లాన్లు.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
- 50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
- AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ అత్యవసర భేటీ.. స్థానిక ఎన్నికలపై ఫోకస్, బీసీ రిజర్వేషన్లపై కీలక నిర్ణయం..
అంతేకాకుండా రాష్ట్రంలో గత మూడేళ్లుగా బీజేపీ ఏం చేసిందని ప్రియాంక గాంధీ ప్రశ్నించారు. ప్రస్తుత బీజేపీ ప్రభుత్వంలో ఎవరొక్కరి జీవితమైనా బాగుపడిందా అంటూ.. మోడీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో ఓడిపోవడం బీజేపీకి చెంపపెట్టు అని అన్నారు. మరోవైపు 2018లో జరిగిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపొందగా.. రెండేళ్ల తర్వాత జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరారు. అంతేకాకుండా ఆయనతో పాటు 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పట్టుకుపోయారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయి, బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
Read Also : Civil Services: సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఫలితాలు విడుదల..
ఈ ఏడాది చివర్లో మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే పలు హిందూ సంఘాలు కాంగ్రెస్కు మద్దతు ప్రకటించాయి. మాజీ సీఎం కమల్నాథ్ సమక్షంలో భారీ సంఖ్యలో బజరంగ్ సేన కార్యకర్తలు కాంగ్రెస్లో చేరారు. అయితే ప్రియాంక మధ్యప్రదేశ్ పర్యటనపై బీజేపీ నేతలు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. ఎన్నికలు ఉన్నప్పుడే ప్రియాంకకు పూజలు గుర్తుకు వస్తాయని.. హిమాచల్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఇప్పటికి నెరవేర్చలేదని అక్కడి బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.
తాజావార్తలు
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
CM Chandrababu: నియోజకవర్గాల స్థాయిలో విజన్ ప్లాన్లు.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
-
Election Commission: CTRL+ALT+Delete.. రాత్రికి రాత్రే వేలాది ఓట్లు గాయబ్..!
-
Shai Hope: 5 పరుగులకే 2 వికెట్లు.. ఓటమి తప్పదనుకున్నా.. అతడే మమ్మల్ని గెలిపించాడు!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
ట్రెండింగ్
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!