మోసాలు నిత్యకృత్యం అయిపోయాయి. అమ్మాయిల్ని అబ్బాయిలు, అబ్బాయిలు అమ్మాయిల్ని నిలువునా మోసం చేస్తున్నారు. ప్రేమ పేరుతో, పెళ్లిపేరుతో అడ్డంగా ముంచేస్తున్నారు. తిరుపతిలో ఓమహిళ మోసం బయటపడింది. శ్రీకాళహస్తిలో కిలాడి లేడి ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. శ్రీకాళహస్తి లోని ఓ లాడ్జిలో భక్తుడిని మోసం చేసింది ఓ లేడీ. బస్సులో పరిచయమై లాడ్జికి తీసుకెళ్లింది కిలాడి మహిళ. లేడీ పిలిచింది కదా అని ఎగరేసుకుంటూ వెళ్ళిపోయాడా అమాయక చక్రవర్తి, అనంతరం ప్రసాదంలో మత్తుమందు ఇచ్చి దోచుకుంది ఆ మహిళ.
Read ALso: Monday Bhakthi Tv Live: సోమవారం ప్రదోషకాలంలో శివారాధన చేస్తే…
భక్తుడు నుండి 75 తులాల బంగారం,20 వేల నగదు, ఓ సెల్ ఫోన్ మాయం చేసి పరారైంది ఆ దొంగ లేడి. ఆమె దోచుకెళ్లిన బంగారం, నగదు విలువ 6లక్షల రూపాయలు అంటున్నాడు బాధితుడు. ఈ మోసానికి గురైన వ్యక్తి హైదరాబాద్ కి చెందిన వ్యక్తిగా గుర్తించారు. తనకు జరిగిన మోసం గురించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితుడు. ఇలాంటి కిలాడీ లేడీల గురించి మీడియాలో ఎన్ని వార్తలు వస్తున్నా.. యువత జాగ్రత్ల పడడం లేదు. అవకాశం చిక్కితే ఇలాంటి మోసాలు రోజుకొకటి చేయడానికి కిలాడీలు పొంచి వున్నారు. నిత్యపెళ్లికూతుళ్ళు కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువయిపోయారు.
ఆంధ్రప్రదేశ్ విడాకులు తీసుకున్న వారిని టార్గెట్ చేసి ఒక 54 ఏళ్ళ శరణ్య అనే మహిళ ముగ్గురిని పెళ్లి చేసుకున్న ఘటన చోటు చేసుకుంది. మరో నిత్య పెళ్ళికొడుకు శివ శంకర్ బాబు కూడా విడాకులు తీసుకున్న వారిని టార్గెట్ చేసుకున్నాడు. విడాకులు తీసుకున్న వారిని టార్గెట్ చేసుకుంటున్న కొందరు వారి పరిస్థితులను ఆసరాగా తీసుకుని, నిదానంగా ప్రేమ పేరుతో ట్రాప్ చేస్తున్నారు. ఆపై వారిని పెళ్లి చేసుకుని, అందినకాడికి దండుకుని, వారిని మోసం చేసి వారితో తెగదెంపులు చేసుకుంటున్నారు. మళ్లీ మ్యాట్రిమోనీ ల ద్వారా విడాకులు తీసుకున్న మరొకరిని లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. ఇక ఇటువంటి ఘటనలు తెలుగు రాష్ట్రాలలో ఎక్కువ కావడం ఆందోళన కలిగిస్తున్నాయి.
Read Also: Konda Surekha Resign.. What Next: కొండా సురేఖ రాజీనామా.. నెక్స్ట్ ఏంటి?