లాడ్ బజార్ వ్యాపారుల ఉదారత చాటుకున్నారు. మిస్ వరల్డ్ కంటెస్టెంట్ల దగ్గర వ్యాపారులు డబ్బులు తీసుకోలేదు. మిస్ వరల్డ్ పోటీదారులు కొనుగోలు చేసిన వస్తువులను ఉచితంగానే అందజేశారు. డబ్బులు తీసుకునేందుకు వ్యాపారుల నిరాకరించారు. హైదరాబాద్ విశిష్టతను చార్మినార్ లాడ్ బజార్ ప్రత్యేకతలను ప్రపంచవ్యాప్తంగా తమ దేశాల్లో చాటాలని మిస్ వరల్డ్ కంటెస్టెంట్లను కోరారు. మిస్ వరల్డ్ ప్రతినిధులకు తమ షాపుల్లోకి గులాబీ పూలు ఇచ్చి ఆహ్వానించారు.
కరోనాకు చెక్ పెట్టేందుకు ఇప్పుడున్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్.. అయితే, ఓవైపు వ్యాక్సిన్ల కొరత కొన్ని రాష్ట్రాలను వేధిస్తున్నా.. మరోవైపు.. ఇప్పటికీ వ్యాక్సిన్ అంటే అవగాహనలేక భయపడిపోయేవారు కూడా ఉన్నారు.. దీంతో.. కొన్ని సంస్థలు వినూత్న రీతిలో అవగాహన కల్పించేందుకు పూనుకుంటున్నాయి.. వ్యాక్సిన్ వేసుకొండి.. ఈ గిఫ్ట్‌లు గెలుచుకోండి అంటూ ప్రచారం చేస్తున్నాయి.. ఇక, తమిళనాడులోని చెంగల్ పట్టు జిల్లా కోవలంలో ఎస్ టీఎస్ అనే స్వచ్ఛంద సంస్థ వ్యాక్సిన్ పై వినూత్న అవగాహన కార్యక్రమం చేపట్టింది..…