Site icon NTV Telugu

Ramya Sri: సినీ నటిపై కత్తి దాడి?

Ramya Sri

Ramya Sri

పట్ట పగలే కత్తులు, బ్యాట్ లతో సినీ నటి రమ్య శ్రీ, ఆమె సోదరుడిపై దాడి చేశారు కొంతమంది దండగులు. ఈ రోజు హైదరాబాద్ – గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉన్న ఎఫ్.సి.ఐ. కాలనీ లే అవుట్ లో రోడ్లు మార్కింగ్ చేపట్టింది హైడ్రా. ప్లాట్ ఓనర్స్ సమక్షంలో హైడ్రా అధికారులు రోడ్లు మార్కింగ్ చేస్తుండగా.. వీడియో తీస్తున్న ప్లాట్ యజమానులపై సంధ్యా కన్వెన్షన్ యజమాని శ్రీధర్ రావు అనుచరులు దాడి చేసినట్టు సమాచారం. ప్లాట్ యజమానురాలైన సినీనటి రమ్యశ్రీ, ఆమె సోదరుడు ప్రశాంత్ పై కత్తి, క్రికెట్ బ్యాట్ తో శ్రీధర్ రావు అనుచరులు దాడికి దిగినట్లుగా తెలుస్తోంది.

READ MORE: CM Chandrababu: కుప్పం బాధితురాలికి చంద్రబాబు ఫోన్‌.. ఆర్థికసాయం ప్రకటన.. నిందితులకు వార్నింగ్..

ఈ క్రమంలో గాయాలు పాలైన సినీనటి రమ్యశ్రీ, ఆమె సోదరుడు గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీస్ స్టేషన్ ఎదురుగానే పట్టపగలు దుండగులు.. తమపై హత్యాయత్నం చేసేందుకు ప్రయత్నించారని సినీ నటి రమ్యశ్రీ ఆవేదన వ్యక్తం చేశారు. సంధ్య కన్వెన్షన్ శ్రీధర్ రావు ఆగడాలకు అడ్డుకట్ట వేసే విధంగా పోలీసులు చర్యలు తీసుకోవాలని నటి రమ్యశ్రీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రమ్య శ్రీ తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించారు. ఆమె ఎక్కువగా సినిమాల్లో వ్యాంప్ తరహా పాత్రలు పోషించి గుర్తింపు తెచ్చుకున్నారు.

Exit mobile version