పట్ట పగలే కత్తులు, బ్యాట్ లతో సినీ నటి రమ్య శ్రీ, ఆమె సోదరుడిపై దాడి చేశారు కొంతమంది దండగులు. ఈ రోజు హైదరాబాద్ - గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉన్న ఎఫ్.సి.ఐ. కాలనీ లే అవుట్ లో రోడ్లు మార్కింగ్ చేపట్టింది హైడ్రా. ప్లాట్ ఓనర్స్ సమక్షంలో హైడ్రా అధికారులు రోడ్లు మార్కింగ్ చేస్తుండగా.. వీడియో తీస్తున్న ప్లాట్ యజమానులపై సంధ్యా కన్వెన్షన్ యజమాని శ్రీధర్ రావు అనుచరులు దాడి చేసినట్టు సమాచారం.
క్రికెట్ మ్యాచ్ చూడడానికి వెళ్లి ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. ఈ ఘటన గుజరాత్‌లోని చిఖోద్రాలో చోటుచేసుకుంది. ఇరవై మూడేళ్ల సల్మాన్ వోహ్రా జూన్ 22న గుజరాత్‌లోని చిఖోద్రాలో క్రికెట్ టోర్నమెంట్ మ్యాచ్ చూడటానికి వెళ్లాడు.
Devadula Pump House: ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం దేవాదుల పంప్‌హౌస్‌లో భారీ చోరీ జరిగిన విషయం తెలిసిందే.. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఎట్టకేలకు 5 మందిని అదుపులో తీసుకున్నారు.
ఢిల్లీలోని పాండవ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బేకరీ నిర్వాహకుడిపై ముగ్గురు అన్నదమ్ములు కత్తులతో దాడికి పాల్పడ్డారు. బాధితుడు శశి గార్డెన్‌లో నివాసముంటున్నాడు. అయితే.. తన ఇంటి పక్కన ఉండే అక్రమ్ అనే వ్యక్తి తనపై కార్పొరేషన్‌తో పాటు ఇతర విభాగాల్లో తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నాడని బాధితుడు ఆరోపించాడు. అంతేకాకుండా.. బేకరీ కారణంగా తన ఇల్లు వేడి అవుతుందని.. బేకరీని మూసివేయాలని ఒత్తిడి తెచ్చినట్లు బాధితుడు పేర్కొన్నాడు.
Attack With Knives: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సులేమాన్ నగర్ లో ఓ కుటుంబం రెచ్చిపోయింది. తల్వార్లతో , రాడ్లతో మరో కుటుంబపై విచక్షణా రహితంగా దాడి చేసింది. గాయాలైన వారికి హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.