టీడీపీ నేత బండారు సత్యనారాయణ మంత్రి రోజాపై చేసిన వ్యాఖ్యలు ఏపీలో దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. అయితే.. మంత్రి రోజాపై బండారు సత్యనారాయణ చేసిన అనుచిత వ్యాఖ్యలపై పోలీసులు ఆయనను అరెస్ట్ చేసిన కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు. అయితే.. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు బండారు సత్యనారాయణ వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే.. ఈ క్రమంలోనే.. మంత్రి రోజా పై టీడీపీ నేత బండారు సత్యనారాయణ అనుచిత వ్యాఖ్యలపై సినీ నటి ఖుష్బూ స్పందించారు.
Also Read : Mumbai : ఘోర అగ్నిప్రమాదం.. ఏడుగురు మృతి, 40 మందికి గాయాలు..
ఈ సందర్భంగా ఖుష్బూ మాట్లాడుతూ.. మంత్రి రోజా పై టీడీపీ నేత బండారు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నానని వెల్లడించారు. రోజాకు నా పూర్తి మద్దతు ఉంటుందని ఖుష్బూ తెలిపారు. రోజాకు బండారు క్షమాపణ చెప్పే వరకు నేను పోరాడుతా అని ఆమె అన్నారు. అంతేకాకుండా.. రాజకీయ నాయకుడి గానే కాదు మనిషిగా కూడా బండారు విఫలమయ్యాడని ఆమె మండిపడ్డారు. నారీ శక్తి వంటి చట్టాలను దేశంలో తెచ్చుకుంటున్న సందర్భం ఇది అని ఆమె వ్యాఖ్యానించారు. మహిళల గురించి నీచంగా మాట్లాడటం తమ జన్మ హక్కు అనుకుంటున్నారు బండారు సత్యనారాయణమూర్తి వంటి వ్యక్తులు అని ఆమె ధ్వజమెత్తారు.
Also Read : Prabhas: కన్నప్పలో “శివుడు” ఇలా ఉంటే థియేటర్లు టెంపుల్స్ గా మారిపోతాయి