ఒకటి రెండు సీట్ల కోసం సీపీఐ పార్టీ.. ఏ పార్టీకి తలవంచదని.. కాకపోతే బీజేపీ నిలువరించే క్రమంలో ఏ పార్టీతోనైనా పొత్తు కడతామని స్పష్టం చేసారు భారత కమ్యూనిస్టుపార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు. కరీంనగర్ లో జరిన సీపీఐ జిల్లా సర్వసభ్య సమావేశానికి బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యుడు చాడవెంకట్ రెడ్డితో కలిసి కూనంనేని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నగరంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కోతిరాంపూర్, కమాన్ చౌరస్తా, వన్ టౌన్, బస్టాండ్, మల్టీప్లెక్స్ మీదుగా సమావేశం జరిగే రెవెన్యూ గార్డెన్ వరకు బైక్ ర్యాలీ చేపట్టారు. అనంతరం జరిగిన సమావేశంలో కూనంనేని కార్యకర్తలకు, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసారు. పొత్తులకు సంబంధించిన వచ్చే ఎన్నికల్లో అందరం కలిసి నిర్ణయం తీసుకుంటామన్నారు.
Also Read : Bus Crashes Tree: చెట్టును ఢీకొట్టిన పెళ్లి బస్సు.. ముగ్గురు మృతి, 50 మందికి గాయాలు
పొత్తులు పెట్టుకున్నంత మాత్రాన పోరాటాలు వదలబోమని.. కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చేలా ఒత్తిడి తెచ్చేందుకు పోరాటాలు కొనసాగిస్తామని కూనంనేని తెలిపారు. కాంగ్రెస్ తో పొత్తు విషయంలో జాతీయ స్థాయి పార్టీలో ఆలోచిస్తామని ఆయన తెలిపారు. గణమైన చరిత్ర గల పార్టీ సీపీఐ పార్టీ ఎన్నో త్యాగాలు చేసిందన్నారు. తమ పార్టీ గురించి మాట్లాడే హక్కు ఎవరికీ లేదన్న ఆయన… తమ పార్టీని కొందరు అమ్ముడు పోయే పార్టీ అంటున్నా.. అది నిజం కాదన్నారు. బీజేపీ దేశం కోసమే, రాముని కోసమే పుట్టిన పార్టీ కాదని.. కేవలం రావణాసురుల కోసమే ఆ పార్టీ పుట్టిందని తీవ్ర విమర్శలు చేసారు. బండి సంజయ్, రేవంత్ రెడ్డి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునుడు కాదని.. తెలంగాణ కు ఏం చేశారో చెప్పాలని కూనంనేని ప్రశ్నించారు.
Also Read : Taneti Vanitha : ఏదో రకంగా ప్రభుత్వంపై బురద జల్లడానికే చంద్రబాబు ప్రయత్నం