KTR : తెలంగాణలో ఇటీవల జరుగుతున్న మిస్టీరియస్ మరణాల (Mystery Deaths) అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇతరులపై బోరింగ్ ప్రసంగాలు ఇస్తూ, పరిపాలన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి, రాష్ట్ర పాలన నిర్వహించే బాధ్యత తనపై ఉందన్న విషయాన్ని మరిచిపోయి, అసంబద్ధ ఆరోపణలు చేస్తూ, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు.
“ఒక ముఖ్యమంత్రి (Chief Minister) లాగా మాట్లాడాలి కానీ, చీప్ మినిస్టర్ (Cheap Minister) లా కాదు” అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. మిస్టీరియస్ మరణాలపై నిజాయితీ ఉంటే విచారణ చేయించుకోవచ్చని, కానీ బ్లేమ్ గేమ్ (Blame Game) ద్వారా ప్రజల దృష్టి మళ్లించేందుకు ప్రయత్నించడం సరైన విధానం కాదన్నారు.
ఎస్ఎల్‌బీసీ (SLBC) టన్నెల్ ప్రమాదం గురించి స్పందించిన కేటీఆర్, రేవంత్ రెడ్డి అసమర్థత వల్లే ఈ విషాదం చోటు చేసుకుందని తీవ్ర విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వంపై నెపం నెట్టి తన పాలనా వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
“ఆడలేక మద్దెల ఓడు అన్నట్లుగా రేవంత్ రెడ్డి వ్యవహారం సాగుతోంది. జిఎస్ఐ (GSI), ఇంజనీరింగ్ నిపుణులను సంప్రదించకుండానే ఆగిపోయిన ప్రాజెక్టును పాత యంత్రాలతో తిరిగి ప్రారంభించారు. కేవలం అవినీతి డబ్బు కోసమే ముందు జాగ్రత్తలు తీసుకోకుండా ఈ ప్రాజెక్టును ప్రారంభించారని” మండిపడ్డారు.
ఈ అశ్రద్ధ కారణంగా ఎనిమిది మంది కార్మికులు ప్రమాదంలో చిక్కుకున్నారని, వారి ప్రాణసంకటానికి రేవంత్ రెడ్డే పూర్తిగా బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. “కార్మికులను కాపాడాల్సింది పోయి, బ్లేమ్ గేమ్ ఆడుతున్నారు. ఇది అత్యంత బాధాకరం” అని అన్నారు.
Shikhar Dhawan: ఎప్పుడు తగ్గాలో, ఎప్పుడు నెగ్గాలో.. రోహిత్‌కు బాగా తెలుసు
రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోయినందున ప్రజల దృష్టి మరల్చేందుకు మిస్టీరియస్ మరణాల విషయాన్ని లేవనెత్తుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. గత 15 నెలలుగా ఆయన కేవలం ప్రజలను మభ్యపెట్టేందుకు దివERSION పాలిటిక్స్ నడుపుతున్నారని తీవ్ర విమర్శలు చేశారు.
రాష్ట్ర అప్పుల విషయంపై కూడా రేవంత్ రెడ్డి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని, వాస్తవానికి రూ. 6,500 కోట్లలో కేవలం వడ్డీ చెల్లింపులే ఉన్నాయని, కానీ ప్రజలను తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. “రేవంత్ రెడ్డికి ఆర్థిక వ్యవస్థపై సరైన అవగాహన లేకపోవడమే ఇది నిరూపిస్తుంది” అని విమర్శించారు.
“రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అవకాశం వచ్చింది, కనీసం రాష్ట్రానికి మంచి చేసే దిశగా పనిచేయాలి. కానీ, రాజకీయ డ్రమాలు ఆడుతూ, ప్రజలను మోసగించడమే ఆయన పని అయింది” అని కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ అభివృద్ధికి ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ తాము పూర్తి సిద్ధంగా ఉన్నామని, ప్రజలతో కలిసి మళ్లీ బలమైన రాజకీయ పోరాటం చేస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు.
Nandamuri Balakrishna: బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు.. వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు..