Site icon NTV Telugu

KTR: “డోంట్‌ వరీ”.. మరో 500 రోజుల్లో కేసీఆర్ ప్రభుత్వం..

Ktr

Ktr

KTR: హైడ్రా పెద్దవాళ్లని వదిలిపెట్టి పేదవాళ్ళ మీద పడిందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. జూబ్లీహిల్స్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ప్రసంగించారు. పేద వల్ల బాధ అందరికీ తెలవాలని ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశాం.. పేదవాళ్లు కూలి పని చేసుకుని ఇటుక ఇటుక పేర్కొని కట్టుకున్న ఇండ్లను కూల్చేశారన్నారు. వాళ్లు పెద్దవాళ్లకు నోటీసులు ఎందుకు ఇవ్వలేదు చెప్పగలుగుతారా? అని ప్రశ్నించారు. హైదరాబాద్లో హైడ్రావల్ల అనేకమంది రోడ్లమీద పడ్డారు.. పేద వాళ్ళ మీద విరుచుకు పడుతుంది హైడ్రా అని విమర్శించారు. ఈ ప్రభుత్వంలో పెద్ద వాళ్లకు ఒక న్యాయం పేద వాళ్లకు ఒక న్యాయం లాగా ఉందన్నారు. భట్టి విక్రమార్క తన ప్రజెంటేషన్లో పెద్దపెద్ద ప్రాజెక్టులను చూపించారని.. కానీ వాళ్లను ఏమీ అనకుండా వదిలేశారన్నారు. కేసీఆర్ హయాంలో ఎన్నో నిర్మాణాలు జరిగాయని గుర్తు చేశారు. దాదాపు లక్ష డబల్ బెడ్రూంలో ఇండ్ల నిర్మాణం జరిగిందన్నారు. కానీ ఈ ప్రభుత్వంలో కూలగొట్టే పనులే జరుగుతున్నాయని మండిపడ్డారు.

READ MORE: Pakistan: పాకిస్తాన్ నేవీ హెచ్చరిక.. సర్‌క్రీక్‌ సమీపంలో దాయాది యుద్ధ విన్యాసాలు..

టైం ఇస్తే కోర్టుకు వెళ్తారని హైడ్రా కమిషనర్ అంటున్నారు.. ముఖ్యమంత్రి సోదరుడు దుర్గం చెరువు దగ్గర ఎఫ్టీఎల్ లోనే ఇల్లు కట్టారు.. ఆయన కోర్టుకు వెళ్లేందుకు సమయం ఇచ్చారని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. “ముఖ్యమంత్రి సోదరుడు కాబట్టి ఆయనకు కోర్టు కు వెళ్లే టైం ఇచ్చింది హైడ్రా.. మాజీ మంత్రి మహేందర్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి ,మంత్రి వివేక్ లు కట్టిన ఇండ్లను ముట్టుకోవడం లేదు.. మన పార్టీలో గెలిచి కాంగ్రెస్ లోకి వెళ్లిన ఎమ్మెల్యే అరీకెపూడి గాంధీ గాజులరామారం లో కట్టిన వాటిని కూడా ముట్టుకోవడం లేదు.. పోలీసుల దగ్గరుండి ఆయన స్థలానికి బ్లూ షీట్లు వేసి రక్షణ ఇస్తున్నారు.. మూసి నీళ్లను అడ్డుకుంటూ కడుతున్న కట్టడాలను కూడా ముట్టుకోవడం లేదు.. ఆ పెద్ద ప్రాజెక్టుల వాళ్ళ దగ్గర డబ్బులు లాగడానికి హైడ్రాను ఈ ప్రభుత్వం వాడుకుంటుంది.. ఓడ మీద ఉన్నప్పుడు ఓడ మల్లన్న దిగిన తర్వాత బోడ మల్లన్న అనే చందంగా ఈ ప్రభుత్వం ఉంది.. మరో 500 రోజుల్లో కేసీఆర్ ప్రభుత్వం వస్తుంది.. మీకు న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటాం..” అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

Exit mobile version