Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Ktr Slams Congress Government Khammam Political Strategy

KTR : బీసీ సోదరులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది.

Published Date :February 11, 2025 , 4:32 pm
By Gogikar Sai Krishna
  • ఖమ్మం జిల్లాలోని ప్రత్యేక రాజకీయ సమీకరణాల వల్ల బీఆర్ఎస్‌కు కొంత నష్టం జరిగింది
  • డిప్యూటీ సీఎంతో కలిపి ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు
  • కానీ వరదల సమయంలో వాళ్లతో పైసా ఉపయోగం లేదు : కేటీఆర్‌
KTR : బీసీ సోదరులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది.
  • Follow Us :
  • google news
  • dailyhunt

KTR : ఖమ్మం జిల్లాలోని ప్రత్యేక రాజకీయ సమీకరణాల వల్ల బీఆర్ఎస్‌కు కొంత నష్టం జరిగిందన్నా కేటీఆర్‌. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. డిప్యూటీ సీఎంతో కలిపి ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారని, కానీ వరదల సమయంలో వాళ్లతో పైసా ఉపయోగం లేదని ఆయన విమర్శించారు. ఒక కుటుంబం వరద నీళ్లలో చిక్కుకుంటే కనీసం హెలికాప్టర్ తెప్పించి కాపాడాలన్న సోయి మంత్రులకు లేదని ఆయన మండిపడ్డారు. ఎమ్మెల్యేల బర్త్‌డేలకు ఇంకా వేరే పనికిమాలిన పనులకు మంత్రులు హైదరాబాద్ నుంచి కూతవేటు దూరానికి కూడా హెలికాప్టర్లలో పోతున్నారని ఆయన హెద్దేవ చేశారు. బీఆర్ఎస్ హయాంలో వరదలు వచ్చినప్పుడు భూపాలపల్లి జిల్లాలోని మారుమూల గ్రామాలకు కూడా నాలుగు హెలికాప్టర్లను పంపి ప్రజలను కాపాడామని, మాకు ప్రాణం విలువ తెలుసు అని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. వరద తగ్గుముఖం పట్టినంకనే ఖమ్మంలో మంత్రులు పర్యటించారు. ముఖ్యమంత్రి రేవంత్ కూడా ఓపెన్ టాప్ జీపులో చేతులు ఊపుతూ కాలు కింద పెట్టకుండా అటు ఇటు తిరిగి వెళ్లిపోయాడు. ప్రజలు తిడుతున్న తిట్లను వింటే పౌరుషమున్న ఎవడైనా బకెట్ నీళ్లలో దూకి చచ్చేవాడని, కానీ రేవంత్ రెడ్డికి రోశం లేదు కాబట్టి అన్ని దులుపుకొని తిరుగుతున్నాడని ఆయన సెటైర్‌ వేశారు.

Maruti Celerio: ప్రయాణికుల సేఫ్టీ కోసం 6 ఎయిర్‌బ్యాగులు.. ధర తక్కువే..!

అంతేకాకుండా..’మా స్కూటీ ఏమైందని కాలేజీ పిల్లలు కూడా పోస్ట్ కార్డు ఉద్యమం మొదలుపెట్టారు. కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా లేకపోయేసరికి ఎంతో నష్టపోయామన్న భావనలో తెలంగాణలోని ప్రతి ఒక్కరూ ఉన్నారు. ముఖ్యమంత్రి నియోజకవర్గం లోని పనులతో పాటు తెలంగాణలోని ప్రతి పని కాంట్రాక్టు కూడా ఇవ్వాళ ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రికే దక్కుతుంది. కాంట్రాక్టు మంత్రి, ఆయన కమిషన్ల కోసమే ముఖ్యమంత్రి పని చేస్తున్నారని నిన్న కొడంగల్ లో చెప్పా. డిప్యూటీ సీఎం 30% కమిషన్లు తీసుకొని పనులు చేస్తున్నారని సొంత పార్టీ ఎమ్మెల్యేనే చెప్తున్నారు. బీసీ సోదరులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది. 42% రిజర్వేషన్ అమలు చేస్తామని, సబ్ ప్లాన్ అమలు చేస్తామని లక్ష కోట్ల బడ్జెట్ ఇస్తామని ఐదు వందల శాతం బీసీ జనాభాను తగ్గించింది. కేసీఆర్‌ చేపించిన సమగ్ర కుటుంబ సర్వేలో బీసీ జనాభా 51.5% ఉంటే రేవంత్ చేసిన కులగరణ సర్వేలో ఐదున్నర శాతం తగ్గించి 46% కి బీసీ జనాభాను చూపిస్తుంది. మహబూబబ్‌నగర్ జిల్లాలో కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తున్న ఓ మంత్రిని తులం బంగారం లేదని మహిళలు ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకుల గల్లాలు పట్టి ప్రజలు కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. పోలీసులను అడ్డం పెట్టుకొని ఖమ్మం జిల్లాలోని ముగ్గురు మంత్రులు స్థానిక సంస్థల్లో ఏకగ్రీవానికి కుట్రలు చేస్తున్నారు. ఈ కుతంత్రాలను గులాబీ దండు అడ్డుకుంటుంది. త్వరలోనే ఖమ్మం వస్తాను.’ అని కేటీఆర్‌ అన్నారు.

CM Chandrababu: అడవి మార్గంలో శ్రీశైలానికి వచ్చే వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలిగించొద్దు

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • BRS
  • Khammam Politics
  • ktr
  • Political criticism
  • revanth reddy

తాజావార్తలు

  • Hyderabad Police: ‘రీల్’ కోసం ‘రియల్’ గౌరవం కోల్పోకండి.. వారికి హైదరాబాద్ పోలీస్ స్ట్రాంగ్ వార్నింగ్

  • CM Chandrababu Serious Warning: మంత్రులకు సీఎం సీరియస్‌ వార్నింగ్.. కీలక సమాచారం ఎలా లీక్‌ అయ్యింది..?

  • AP Cabinet: ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు.. 60కి పైగా ఎజెండా అంశాలకు ఆమోదం..

  • Love Attack: కడపలో ప్రేమోన్మాది ఘాతుకం.. విద్యార్థిని గొంతు కోసి హత్య..

  • Thappad Gang: చీకట్లో బైక్‌పై వస్తారు.. చెంప పగులగొట్టి పోతారు.. “చెంపదెబ్బల ముఠా” హల్‌చల్

ట్రెండింగ్‌

  • AI Impact on Jobs: ఆంత్రోపిక్ షాకింగ్ రిపోర్ట్.. కోడింగ్ నుంచి సేల్స్ వరకు ఈ టాప్ 10 కెరీర్లు ముగిసినట్టే..!

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions