KTR: “23 లక్షల మందికి మానసిక క్షోభ”.. నీట్ ప్రశ్నాపత్రం లీక్‌పై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR Slams Centre Over NEET 2026 Paper Leak: నీట్ ప్రశ్నాపత్రం లీకై ఏకంగా పరీక్షనే రద్దుచేయాల్సిన దుస్థితి రావడం కేంద్ర ప్రభుత్వానికి సిగ్గుచేటు అని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. పగలూ రాత్రి కష్టపడి చదివిన ఎంతోమంది విద్యార్థుల జీవితాలతో కేంద్రం చెలగాటమాడిందన్నారు. పకడ్బందీగా పరీక్షలు నిర్వహించడం చేతకాని ఎన్డీఏ ప్రభుత్వ వైఫల్యం వల్లే మరోసారి పేపర్ లీకైందన్నారు. ఈ మేరకు తాజాగా ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. “2024 లోనూ నీట్ ప్రశ్నాపత్రం లీకైన ఉదంతం నుంచి గుణపాఠం నేర్చుకోకపోవడం వల్లే మళ్లీ ఈ ఘటన పునరావృతమైంది. జాతీయ అర్హత పరీక్ష నిర్వహణలో వరుసగా వెలుగుచూస్తున్న ఈ అసమర్థత విద్యార్థుల పట్ల శాపంగా మారింది. ఏకంగా వందకు పైగా ప్రశ్నలు పరీక్షకు ముందు రోజే లీక్ కావడం వ్యవస్థలో ఉన్న దారుణమైన లోపాలను బయటపెట్టింది. దేశవ్యాప్తంగా ఈ ఏడాది నీట్ పరీక్ష రాసిన దాదాపు 23 లక్షల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులను కేంద్ర సర్కారు తీవ్ర మానసిక క్షోభకు గురిచేసింది. ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారాన్ని అత్యంత సీరియస్ గా తీసుకుని కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించాలి. దీని వెనక ఎంత పెద్దవాళ్ల హస్తం ఉన్నా, వాళ్లందరినీ పట్టుకుని కఠినంగా శిక్షించాలి, వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలి. అలాగే సాధ్యమైనంత త్వరగా మళ్లీ నీట్ పరీక్షను అత్యంత పకడ్బందీగా నిర్వహించి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలి. నీట్ పేపర్ లీకేజీకి పూర్తి బాధ్యత వహించి కేంద్ర ప్రభుత్వం విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు క్షమాపణలు చెప్పాలి.” అని ఎక్స్ పోస్ట్‌లో మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా.. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన మెడికల్ ప్రవేశ పరీక్ష ‘నీట్ యూజీ (NEET UG) 2026’ రద్దు కావడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఈ మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్, ‘గెస్ పేపర్’ లీక్ అయ్యిందన్న ఆరోపణల నేపథ్యంలో రద్దయింది. మే 3న జరిగిన ఈ పరీక్ష పారదర్శకతపై కేంద్ర దర్యాప్తు సంస్థలు కీలక ఆధారాలు సేకరించడంతో పరీక్షా విధానం అపహాస్యం కాకూడదనే ఉద్దేశంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. వ్యవస్థపై నమ్మకాన్ని పునరుద్ధరించేందుకు ప్రభుత్వం ఈ కేసును సీబీఐ (CBI)కి అప్పగించింది. ఈ గెస్ పేపర్ ఎలా బయటకు వచ్చింది? దీని వెనుక ఏదైనా ముఠా ఉందా? అనే కోణంలో సీబీఐ సమగ్ర విచారణ జరపనుంది. దర్యాప్తునకు అవసరమైన అన్ని రికార్డులు, డేటాను ఎన్టీఏ స్వయంగా సీబీఐకి అందించనుంది.
Also Read
- Earthquake: బంగాళాఖాతంలో 4.5 తీవ్రతతో భూకంపం.. ఆంధ్రలో ప్రకంపనలు..
- Virat Kohli: ఇంగ్లాండ్‌కు అసలైన మొగుడు విరాట్.. మైదానంలోకి తిరిగి రాగానే 'కోచ్'గా మారిన కోహ్లీ!
- Iran War: నౌకపై ఇరాన్ దాడి, నౌకలో 11 మంది భారతీయులు, ఒకరు గల్లంతు..
- Abhishek Nayar: శ్రేయస్ అయ్యర్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించొద్దు.. రోహిత్, కోహ్లీ లాగే అయ్యర్‌కూ స్వేచ్ఛ ఇవ్వాలి
తాజావార్తలు
-
Nithiin: టాలీవుడ్లో సరికొత్త కాంబినేషన్.. నితిన్, రుక్మిణి వసంత్‌ను కలుపుతున్న నాని!
-
Earthquake: బంగాళాఖాతంలో 4.5 తీవ్రతతో భూకంపం.. ఆంధ్రలో ప్రకంపనలు..
-
Harish Rao : సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్
-
Bengaluru Crime: బెంగళూరులో దారుణం.. పార్సిల్ ఇవ్వడానికి వచ్చి పశువులా ప్రవర్తించిన కామాంధుడు! ఏం చేశాడో తెలుసా?
-
Virat Kohli: ఇంగ్లాండ్‌కు అసలైన మొగుడు విరాట్.. మైదానంలోకి తిరిగి రాగానే ‘కోచ్’గా మారిన కోహ్లీ!
ట్రెండింగ్
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..