NTV Telugu Site icon

KTR : ఆయనకు ఫ్రస్టేషన్‌ తగ్గట్లేదు.. నేను శాశ్వతంగా రాజకీయాలు వదిలేస్తా.. కేటీఆర్‌ సంచలనం

Ktr Assembly

Ktr Assembly

KTR : చివరి రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. అసెంబ్లీ సీఎం రేవంత్‌ రెడ్డి వర్సెస్‌ కేటీఆర్‌ అన్నట్లు మాటల యుద్ధం నడుస్తోంది. గత ప్రభుత్వం తనపై కక్ష కట్టి ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురిచేసిందని సీఎం రేవంత్‌ రెడ్డి ఉగ్రరూపం చూపించారు. అనంతరం కేటీఆర్‌ అసెంబ్లీలో మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌ రెడ్డికి ఫ్రస్టేషన్‌ ఎందుకో అర్థంకావడంలేదు అని ఆయన అన్నారు. ఆయన సీఎం సీటులో కూర్చుంటా అన్నాడు.. కూర్చున్నా కూడా కూల్‌ కావడం లేదంటూ సెటైర్‌ వేశారు కేటీఆర్‌. ఎన్నికల ముందు రైతులకు రైతుబంధు ఇవ్వదంటూ.. ఎన్నికల కమిషన్‌ లేఖ రాసింది అప్పటి పీసీసీగా రేవంత్‌ రెడ్డినే అని ఆయనఅన్నారు. ఇప్పుడు మేము రైతుబంధు అపాం అని నిందలువేస్తున్నామన్నారు.. కావాలంటే.. ఆయన ఎన్నికల కమిషన్‌కు ఇచ్చిన లేఖ కాపీ నాదగ్గర ఉంది ప్రూఫ్‌ చూడండని ఆయన అన్నారు. ప్రతి సారి రుణమాఫీ అంటారు.. ఏ ఒక్కగ్రామంలోనైనా వందశాతం రుణమాఫీ అయితే నేను శాశ్వతంగా రాజకీయాలకు దూరంగా ఉంటా అని సీఎం రేవంత్‌ రెడ్డికి కేటీఆర్‌ సవాల్‌ విసిరారు. కొండారెడ్డిపల్లి పోదామా.? లేకుండా.. సిరిసిల్ల పోదామా..? అంటూ కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.

వందరోజుల్లో తులం బంగారం అని ఎవరు చెప్పమన్నారు. ప్రజలు లంకె బిందెల కోసం ఎదురుచూడాలా..? అని కేటీఆర్‌ ప్రశ్నించారు. ఆయన స్వాతంత్ర్య ఉద్యమం చేసి జైలుకు వెళ్లారా.. మేము కూడా జైలుకు వెళ్లాం.. ముఖ్యమంత్రి హుంకరిస్తున్నారు.. నేను అనుకుంటే అక్కడ ఎవరు ఉండరని అంటున్నారు.. మీరుం ఏం అనుకున్నా ఏం కాదు. చెన్నై సమావేశంలో సీఎంను నేను సమర్థిస్తూ మాట్లాడాను.. పరిపాలన అంటే పంచ్‌ డైలాగ్‌లు కాదు. కక్షసాధింపు లేదంటున్నారు, మా పథకాలను ఎందుకు రద్దు చేశారు అని కేటీఆర్‌ అన్నారు. ఫార్మాసిటీ వద్దన్నారు, ఫార్మావిలేజ్‌లన్నారు. లగచర్లలో 9నెలలు రైతులు ధర్నా చేస్తే పట్టించుకోలేదన్నారు. అధికారులను రైతులు అడ్డుకుంటే అదిమాకు ఆపాదిస్తున్నారని ఆయన మండిపడ్డారు.

Infinix Note 50x 5G+: పిచ్చెక్కించే ఫీచర్లతో.. ఇన్ఫినిక్స్ కొత్త ఫోన్ విడుదల.. ధర తక్కువే