KTR: సీఎం రేవంత్పై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మల్కాజ్గిరి పరిధిలోని కుత్బుల్లాపూర్లో జరిగిన రోడ్ షోలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ, కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీఆర్ఎస్ వాళ్లు 10-12 సీట్లు గెలిచిన తర్వాత ఏ పార్టీలో ఉంటదని మాట్లాడుతున్నారు.. ఈ దేశంలో ఇండియా, ఎన్డీఏ కూటమిలో లేని 13 పార్టీలు ఉన్నాయి.. అవన్నీ పెద్ద పార్టీలేనని తెలిపారు. ఈ 13 పార్టీలే రేపు ఢిల్లీని శాసించవచ్చు.. మనం శాసించి లొంగదీసుకుందామా? యాచిద్దామా? అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో పోయే ఖర్మ బీఆర్ఎస్ కు లేదు.. గతంలో లేదు.. ఇప్పుడు ఉండదన్నారు. తమ చెల్లెలిని తీసుకొని పోయి జైల్లో పెట్టారు.. అలాంటి బీజేపీతో తాము కలుస్తామా? అని అన్నారు.
Chandrababu: నిజ జీవితంలో నా మిత్రుడు పవన్ గబ్బర్ సింగ్.. పవన్ పై చంద్రబాబు ప్రశంసలు
Also Read
- WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
- Pensions: పెన్షన్ల నిధులు విడుదల.. అక్టోబర్ 1వ తేదీ ఉదయం నుంచే పంపిణీ షురూ..
- New Train Service: ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైలు వచ్చేసింది.. వారానికి 3 రోజులు..
- Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
మరోవైపు.. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డో…ఇంకో దివాణో ఇంకేదో మాట్లాడితే మీరు ఆగం కావొద్దని సూచించారు. తాను రేవంత్ రెడ్డిని దివాణే అంటున్నానన్నారు. రేవంత్ రెడ్డిని లంగా, దొంగ, లుచ్చగాడు అని తాను అనలేదన్నారు. గిటువంటి లత్కోర్ మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడని తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు. పరిపాలన అనేది పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని విమర్శించారు. బూతులు మాట్లాడుడు కాదు కదా పరిపాలన అంటే.. తాము పరిపాలన బాగా చేశాం కనుకనే హైదరాబాద్ లో 16 సీట్లు వచ్చాయన్నారు. మీ ఎమ్మెల్యేకు తోడు ఎంపీని కూడా గెలిపిస్తే మరింత అభివృద్ధి చేసుకోవచ్చని తెలిపారు.
Sundar C: తల్లి కాలేదని చెప్పారు.. ఇంకో పెళ్లి చేసుకోమంది.. ఎన్నో బాధలు పడ్డాం!
హైదరాబాద్ లో మళ్లీ కరెంట్, నీటి కష్టాలు మొదలైయ్యాయని కేటీఆర్ తెలిపారు. రేవంత్ రెడ్డి నిజాయితీగా చెప్పి మోసం చేసిండు.. ప్రజలు మోసగాళ్లనే నమ్ముతారని చెప్పి మరి మోసం చేసిండని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీ ఇద్దరు అభ్యర్థులు పొలిటికల్ టూరిస్టులేనని విమర్శించారు. ఒకరు చేవెళ్ల, ఇంకొకరు హుజురాబాద్ నుంచి వచ్చారని తెలిపారు. ఎన్నికలు కాగానే వాళ్లు వెళ్లిపోతారు.. కానీ రాగిడి లక్ష్మారెడ్డి లోకల్ అని అన్నారు. మిమ్మల్ని కోరెదొక్కటే.. బీఆర్ఎస్ కు 10-12 సీట్లు ఇవ్వండని కోరారు. మళ్లీ రాష్ట్రంలో ఆరు నెలల్లో రాష్ట్ర రాజకీయాలను కేసీఆర్ శాసించే పరిస్థితి వస్తుందని చెప్పారు.
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!