KTR : కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో విద్యుత్ కోతలు మొదలైనై
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరంగల్ హంటర్ రోడ్డు లోని నాని గార్డెన్‌లో ఏర్పాటు చేసిన వరంగల్ ఈస్ట్ నియోజకవర్గం పట్టభద్రుల ఉప ఎన్నిక సన్నాహక సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. రైతు బిడ్డ, చదువుకున్న యువకుడు మన భారాస ఎమ్మెల్సీ అభ్యర్థి…. మహిళల మెడలో తాళిబొట్టు కొట్టేసే అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ అరచేతిలో వైకుంఠం చూపించి.. అధికారంలోకి వచ్చారని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో విద్యుత్ కోతలు మొదలైనవని ఆయన ఆయన పేర్కొన్నారు. నిన్న ఎంజీఎం ఆసుపత్రిలో 5గంటలు విద్యుత్ నిలిపోయిందని, 2లక్షల రుణమాఫీ కాలేదని, రైతు బంధు రైతులకు రాలే , కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక.. ఒక్క నోటిఫికేషన్ ఇవ్వాలేనన్నారు. వరికి 500 బోనస్ దక్కాలే… రాష్ట్రంలో మోసాల పరంపర సాగుతుంది, కాంగ్రెస్ నాయకులు పచ్చి మోసగాళ్లు, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతు కావాలంటే… రాకేష్ రెడ్డిని గెలిపించాలన్నారు. 420 హామీలతో అధికారంలోకి వచ్చారని, 24 అంతస్తు ఆసుపత్రి నిర్మాణ పనులు నిలిచిపోయాయని, కొత్త పరిశ్రమలను తీసుకువచ్చే స్థాయి కాంగ్రెస్ నాయకులకు లేదన్నారు. ఉన్న కంపెనీలకు కపాడుకునే సత్తా లేని నాయకులు కాంగ్రెస్ నాయకులు, తీన్మార్ మల్లన్న లాంటి నాయకులు గెలిస్తే చట్టసభలు బూతు మాటలకు వేదిక అవుతుందన్నారు కేటీఆర్.
అంతేకాకుండా.. ‘ఆరు నెలల క్రిందట చెప్పాము మోస పోకండి అని.. రుణమాపీ చేస్తా అన్నాడు రేవంత్ రెడ్డి ఇంతవరకు చేయలేదు.. రేవంత్ రెడ్డి వచ్చాక రైతు బంధు, ఎలక్షన్స్ వచ్చినప్పుడే గుర్తుకు వస్తుంది… ఎన్నికల ముందు వడ్లకు బోనస్ ఇస్త అన్నాడు… ఇప్పుడేమో కేవలం సన్న వడ్లకే ఇస్తా అంటున్నాడు… కాబట్టి విద్యావంతులారా అలోచించి ఓటు వేయండి.. ఏం జి ఏం హాస్పిటల్ లో 4 గంటలు కరెంట్ లేదు నిన్న, ఒక్క జనరేటర్ కూడా పనిచేయక రోగులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు… తెలివితక్కువ, సన్యాసీ మన ముఖ్యమంత్రి అయ్యాడు.. మల్లన్న ఒక బ్లాక్ మేలర్, యూట్యూబ్ ఛానల్ పట్టుకొని ఇష్టం ఉన్నట్టు అబద్ధాలు చెప్పే వ్యక్తి… చెంచల్ గూడా క్రిమినల్ మల్లన్న… కాబ్బటి ప్రజలరా అలోంచించండి ఒక విద్యావంతుని గెలిపించండి… ఒక మోసపూరిత వ్యక్తి కీ ఒక క్రిమినల్ కీ ఓటు వేయకండి.. జాబ్ క్యాలెండర్ ఇస్తా ఆనాడు రేవంత్ రెడ్డి ఎటు పోయింది.. ఒక ఉచిత బస్ తప్ప ఎలాంటి పధకాలు హామీ కాలేదు… చాలామంది విద్యావంతులు రాకేష్ రెడ్డి కీ ఓటు వేయమని చెపుతున్నారు.. ఒక రైతు బిడ్డ, గోల్డ్ మేడలిస్ట్ కీ ఓటు వేసి అధిక మెజారిటీ గెలిపించాలని కోరుకుంటున్నాను…’ అని కేటీఆర్ అన్నారు.
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?