KTR: మా ప్రభుత్వం రాగానే ఆ భూములు వెనక్కి తీసుకుంటాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR: గత ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్‌ను గెలిపించకుండా బీఆర్ఎస్ అభ్యర్థులకే పట్టం కట్టారని.. హైదరాబాద్ అభివృద్ధి చూసి గెలిపించారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఓఆర్ఆర్ బయట ప్రజలు కాంగ్రెస్ చెప్పే అబద్ధపు మాటలు నమ్మి వాళ్ళకు ఓటు వేశారన్నారు. తెలంగాణ భవన్లో బుధవారం పలువురు కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. ఈ కార్యక్రమానికి హాజరైన కేటీఆర్ ప్రసంగించారు. కాంగ్రెస్ వాళ్ళు నోటికి వచ్చిన బంపర్ ఆఫర్లు ఇచ్చి ఓట్లు వేయించుకున్నారని విమర్శించారు. హైదరాబాద్ వాళ్ళు నమ్మలేదు కానీ ఊళ్లలో నమ్మారు కాంగ్రెస్‌ను గెలిపించారన్నారు. అడవులను అమ్ముకునే వీరప్పన్‌ను అటవీ శాఖ మంత్రిని చేస్తే ఎలా ఉంటుందో.. భూములు అమ్ముకునే రేవంత్‌రెడ్డిని సీఎం చేస్తే పరిస్థితి అలా అయిపోయిందన్నారు.
“చెల్లని నాణేనికి గీతలు ఎక్కువ.. రేవంత్ రెడ్డికి మాటలు ఎక్కువ.. కేసీఆర్‌కు జరగరానిది జరగాలని కోరుకుంటున్నారు. మియాపూర్ ప్రభుత్వ భూముల విషయంలో బీఆర్ఎస్ చేసిన పోరాటం వల్లనే కేసు గెలిచాం. మూడేళ్లలో ఒక్క కొత్త ఇల్లు కూడా కట్టలేదు. రియల్ ఎస్టేట్ బిజినెస్ పూర్తిగా తగ్గిపోయింది. ప్లాట్ల విలువ చాలా తగ్గిపోయింది. హైదరాబాద్‌లో కోటి ఎకరాల భూమిని నిషేధిత జాబితాలో పెట్టారు. రేవంత్‌రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే మియాపూర్ భూములలో తెలంగాణ అమర వీరులకు స్థలాలు ఇవ్వండి. ఎర్రవల్లి ఇస్తాను అంటున్నావు. అంత దూరంలో ఎందుకు.. మియాపూర్‌లో అమర వీరులకు స్థలాలు ఇవ్వండి.. మేము స్వాగతిస్తాం. ఏడాది లోపు కేసీఆర్ మళ్ళీ రాబోతున్నారు. మా ప్రభుత్వం రాగానే రియల్ ఎస్టేట్ కబ్జా దారులకు ఇచ్చిన భూములు వెనక్కి తీసుకుంటాం.” అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
Also Read
- Virat Kohli: "ఏ దిగ్గజానికీ సాధ్యంకాలే".. వన్డేల్లో విరాట్ కోహ్లీ వరల్డ్ రికార్డ్.. ఏకైక బ్యాట్స్‌మన్‌గా విరాట్ హిస్టరీ..
- AP Cyclones Damage: సీఎం చంద్రబాబుకు ప్రధాని మోడీ ఫోన్.. ఏపీపై రెండు తుఫాన్ల ప్రభావంపై ఆరా!
- Varanasi: రాజమౌళి గ్లోబల్ బ్రాండ్ + మహేష్ స్టామినా.. ‘వారణాసి’తో ఓవర్సీస్ బాక్సాఫీస్ లెక్కలు మారబోతున్నాయా.?
- Movie Shows: సినిమా టికెట్ ధరలపై సర్కార్ కీలక నిర్ణయం..! ఎర్లీ మార్నింగ్ షోలకు ఓకే.. రేట్ల పెంపునకు నో..!
- Tags
- BRS
- ktr
- Miyapur
- revanth reddy
- telangana
తాజావార్తలు
-
KTR: మా ప్రభుత్వం రాగానే ఆ భూములు వెనక్కి తీసుకుంటాం..
-
Virat Kohli: “ఏ దిగ్గజానికీ సాధ్యంకాలే”.. వన్డేల్లో విరాట్ కోహ్లీ వరల్డ్ రికార్డ్.. ఏకైక బ్యాట్స్‌మన్‌గా విరాట్ హిస్టరీ..
-
AP Cyclones Damage: సీఎం చంద్రబాబుకు ప్రధాని మోడీ ఫోన్.. ఏపీపై రెండు తుఫాన్ల ప్రభావంపై ఆరా!
-
Varanasi: రాజమౌళి గ్లోబల్ బ్రాండ్ + మహేష్ స్టామినా.. ‘వారణాసి’తో ఓవర్సీస్ బాక్సాఫీస్ లెక్కలు మారబోతున్నాయా.?
-
US Midterm Elections 2026: మిచిగాన్ నుంచి తొలి ముస్లిం సెనేటర్‌గా చరిత్ర సృష్టించిన డెమోక్రాట్.. అబ్దుల్ ఎల్-సయీద్ ఎవరు?
ట్రెండింగ్
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 188 కి.మీ ప్రయాణం.. స్పోర్టీ లుక్‌తో కొత్త ఎలక్ట్రిక్ బైక్ Hero VIDA VXZ..
-
హోండా తొలి ఎలక్ట్రిక్ ఎస్యూవీ వచ్చేస్తోంది.. డిసెంబర్ 2న Honda ALPHA గ్లోబల్ లాంచ్..!
-
Sachin Tendulkar: నచ్చిన ఆటగాళ్లను ఎంచుకోలేకపోయా.. టీమిండియాపై సచిన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
IPL 2027-CSK: ఐపీఎల్లో సీఎస్కే భారీ ప్లాన్.. రూ.13 కోట్ల సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్‌పై కన్ను!
-
Rohit Sharma: వయసు జస్ట్ నంబర్ మాత్రమే.. రోహిత్ శర్మ డైవ్ చూస్తే ‘వావ్’ అనాల్సిందే.!