NTV Telugu Site icon

KTR : ఈ ఉడత ఊపులకు భయపడం.. ఏ కేసు పెట్టుకుంటవో పెట్టుకో..!

Ktr

Ktr

KTR : టీఆర్‌ఎస్‌ అనే పార్టీ పుట్టినప్పటినుంచి తెలంగాణ రాష్ట్రం కోసం కష్టపడిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. ఇవాళ ఆయన ఎన్టీవీతో ముఖాముఖి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలోకి వచ్చిననాడే చావు తెగించి వచ్చామని, ఉద్యమ సమయంలో చంద్రబాబు, రాజశేఖర్‌ రెడ్డి లాంటి పెద్ద పెద్ద నాయకులతో కొట్లాడినమని ఆయన అన్నారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వాన్ని నడుపుతున్న చిట్టినాయుడి అని, ఆ చిట్టినాయుడు ఏదో కేసు పెడుతా.. అది చేస్తా.. ఇది చేస్తా అంటే భయపడేది లేదని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. పొలిటికల్‌ బాంబులు పేలుతై అంటే.. ముందు మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డిలూ.. అమృత్‌ స్కాంలో రేవంత్‌ రెడ్డి బావమరిది 1,137కోట్ల వర్క్‌ ఇచ్చినప్పుడు బీజేపీ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకుంటలేదు. అర్హత లేని కంపెనీకి అమృత్‌ స్కీంలో స్కాం చేస్తే ఎందుకు కాపాడుతుందో సమాధానం కావాలన్నారు. పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డిపై జరిగిన రైడ్‌కు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదని, అదానీని పొంగులేటి రహస్యం కలుసుకోవడం.. కాంగ్రెస్‌, బీజేపీల మధ్య ఉన్న అక్రమ సంబంధానికి నిదర్శనమన్నారు.

Lawrence Bishnoi Gang: లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన 7 మంది షూటర్లు అరెస్ట్‌

ఇవన్నీ ప్రశ్నిస్తున్నందుకే మాపై కేసులు పెడుతామంటూ వ్యాఖ్యానిస్తున్నారు.. కేసులు పెడితే భయపడేది లేదని.. ప్రతిపక్షంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తునే ఉంటామన్నారు కేటీఆర్‌. రైతు రుణమాఫీ, రైతు బంధు ఎందుకు ఎగ్గొట్టారని అడుగాతామని, ఆరు గ్యారెంటీల ఎందుకు అమలు చేస్తలేరో ప్రశ్నిస్తూనే ఉంటామని ఆయన అన్నారు. రాష్ట్రంలో కరెంటు ఛార్జీలు పెంచుతున్నమని ప్రతిపాదన వస్తే బీజేపీ ఎందుకు మాట్లాడడం లేదని ఆయన అన్నారు. కాంగ్రెస్‌ పార్టీని రక్షణ కవచంలాగా బీజేపీ కాపాడుతుంటే రాష్ట్ర ప్రజలు చూస్తలేరా.. ప్రజలు అన్ని గమనిస్తున్నారన్నారు. ప్రజలు అమాయకులు అనుకోవడం రేవంత్‌ రెడ్డి అజ్ఞానమన్నారు. దేశంలో ‘ఆయారాం.. గయారాం’ సంస్కృతిని తీసుకువచ్చింది ఇందిరాగాంధీ కాదా అని ఆయన ప్రశ్నించారు. విద్యుత్‌ను వ్యాపరంగా ప్రభుత్వం చూడొద్దని.. బాధ్యతగా చూడాలన్నారు. రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకువచ్చి రాష్ట్ర ఆదాయం పెంచి ఖజానా నింపాలని, కానీ.. పేద ప్రజలపై భారీ మోపి ఆదాయం దండుకోవడం కరెక్ట్‌ కాదన్నారు.

Maldives: భారత్‌ దెబ్బతో మల్దీవులు కుదేలు.. అధ్యక్షుడి జీతం దానం.. ఉద్యోగుల శాలరీల్లో కోత!