Site icon NTV Telugu

KTR: నేను మా నాన్న పేరు చెప్పుకుంటే తప్పేమిటి?.. తెలంగాణ తెచ్చిన మొనగాని పేరు చెప్పుకుంటే తప్పా?

Ktr

Ktr

మాజీమంత్రి కేటీఆర్ తెలంగాణ భవన్లో జరిగిన జాయినింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. మార్పు అని చెప్పి ఊదరగొట్టి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు అయిందన్నారు. ఈ రెండేళ్లలో కూల్చివేతలు, ఎగవేతలు, పేల్చివేతలు మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందని విమర్శించారు. అప్పుడు కాలేశ్వరం బ్యారేజ్ ని పేల్చారు.. ఇప్పుడు చెక్ డ్యాం లను పేలుస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెసోళ్లు దొంగతనంగా ఇసుక తరలించేందుకు కష్టమవుతుంది అని చెక్ డ్యాం లు పేలుస్తున్నారు. నిన్న మొన్న పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. టీవీ పెడితే ఆయన మాట్లాడే తిట్ల పురాణం వినిపిస్తుందన్నారు.

Also Read:Surat Video: 10వ అంతస్తు నుంచి జారిపడ్డ వ్యక్తి.. ప్రాణాలతో ఎలా బయటపడ్డాంటే..!

అనిల్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరేందుకు ఫంక్షన్ హాల్ బుక్ చేస్తే శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆ ఓనర్ ను బెదిరించారు. కేసీఆర్ దయతో గాంధీ ఎమ్మెల్యే అయ్యారు. సీఎం పెద్ద పెద్ద గొంతుతో మాట్లాడుతున్నారన్నారు. రోడ్లపై పెయింట్ వేసుకునే రేవంత్ రెడ్డి పెద్ద స్థాయికి వస్తే మంచిదే, కానీ మంచి పనులతో రావాలని ఎద్దేవ చేశారు. పేమెంట్ కోటాలో సీఎం అయ్యి… ఇప్పుడు కూడా నెలనెలా ఢిల్లీకి సంచులు పంపుతున్నారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే పేరు గాంధీ… చేసేవి గాడ్సే పనులు, భూకబ్జాలకు పాల్పడుతున్నారు. కాంగ్రెస్ లో చేరి బీఆర్ఎస్ లోనే ఉన్నామని చెప్తున్నారు. స్పీకర్ కళ్లు ఉండి చూడలేని ధృతరాష్ట్రునిలా తయారయ్యారని విమవర్శలు గుప్పించారు.

దమ్ముంటే గాంధీ శేరిలింగంపల్లి క్షేత్రానికి రావాలి, ఉప ఎన్నికల్లో తేల్చుకుందాం.. ఎన్నికలకు భయపడి పదిమంది ఎమ్మెల్యేలు దిక్కుమాలిన రాజకీయం చేస్తున్నారు.. ఎమ్మెల్యే దొంగల్లా కలిసినా మనం గట్టిగా కొట్లాడదాం అని పిలుపునిచ్చారు. కేసీఆర్ బయటకు రా అని కాంగ్రెస్ నేతలు అన్నారు. కేసీఆర్ ఒక్క మీటింగ్, ప్రెస్ మీట్ పెడితేనే ముచ్చెమటలు పట్టాయి, చలిజ్వరం వచ్చింది
కేసీఆర్ అసెంబ్లీకి వస్తే రేవంత్ రెడ్డి గుండె ఆగి చస్తారు అని కేటీఆర్ తెలిపారు. మా నాన్నను తిడుతున్నందుకు నాకు చాలా కోపం ఉంది, దొరికితే ఎడమకాలు చెప్పు తీసి కొట్టాలని ఉంది. నేను గుంటూరులో చదివితే తప్పేమిటి… రేవంత్ రెడ్డి లాగా చదువు లేకుండా తిరగలేదు. నేను ఆంధ్రాలో చదివితే తప్పు అట కానీ, ఆయన ఆంధ్రా అల్లుడిని తెచ్చుకున్నారు.. రేవంత్ రెడ్డిని భీమవరం బుల్లోడు అనాలా? అని ఫైర్ అయ్యారు.

Also Read:CJI Suryakant: ఢిల్లీ కాలుష్యాన్ని వారు పరిష్కరించగలరు.. జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్య

అమెరికాలో ఎవరి పని వారు చేసుకోవాలి, నేను చేసుకుంటే తప్పా? ఆయనలా దొంగ పనులు చేయలేదన్నారు. రేవంత్ రెడ్డికి ఏమీ తెలియదు.. నేను మా నాన్న పేరు చెప్పుకుంటే తప్పేమిటి? తెలంగాణ తెచ్చిన మొనగాని పేరు చెప్పుకుంటే తప్పా? అని ప్రశ్నించారు. ఢిల్లీకి సంచులు మోసుకుంటూ గులాంల లాగా బతకబోం… తెలంగాణ పౌరుషంతో బతుకుతామని తెలిపారు. కేసీఆర్ ను మళ్లీ ముఖ్యమంత్రి కానివ్వబోమని రేవంత్ రెడ్డి అంటున్నారు… ఆయన్ను కొడంగల్ లో గెలవకుండా చూద్దాం.. పాలమూరు – రంగారెడ్డి గురించి కేసీఆర్ అడిగితే సమాధానం చెప్పలేక ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు.. హామీల అమలు గురించి కేసీఆర్ అడిగితే రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ ను ఎన్ని కార్పొరేషన్లు చేసినా గెలిపించే బాధ్యత ప్రజలు తీసుకోవాలి.. 2026 లో గట్టిగా కష్టపడితే… 2027 లో ఎన్నికల వాతావరణం వస్తుంది, కేసీఆర్ ను మళ్లీ ముఖ్యమంత్రి చేసుకునే వరకు పోరాడదాం అని కేటీఆర్ పిలుపునిచ్చారు.

Exit mobile version